విజయవాడ దుర్గ గుడిలో చోరీ .. అంతరాష్ట్ర ముఠా పనే !

Update: 2021-01-20 13:30 GMT
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాల్లో మూడు మాయమయ్యాయి. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారు. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైనట్లు సమాచారం. అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించారు.

 అందులో భాగంగా  దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్ ‌తో సమావేశమై.. దుర్గగుడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ఈవో, ఇతర సిబ్బంది కలిసి రథాన్ని పరిశీలించారు. అప్పుడు రథంపై మూడు వెండి సింహాలు మాయమైన విషయాన్ని గుర్తించారు.

దీనిపై ప్రతిపక్షాలు , ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఈ ఘటన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగి నాలుగు నెలల తర్వాత ఈ కేసులో పురోగతి లభించింది. ఈ ఘటన పై విచారణ చేయడానికి ఏర్పాటైన సిట్ ..నింధుతుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఈ ఘటన లో పదుల సంఖ్యల్లో అనుమానితులని ప్రశ్నించిన సిట్ ,ఇది ఒక అంతరాష్ట్ర ముఠా పనిగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఒకరు అరెస్ట్ అయ్యారు. దీనిపై త్వరలోనే పోలీసులు ప్రకటన చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News