కెప్టెన్ మారినా.. ఆటగాళ్లు మారినా.. జట్ల ఫార్మాట్ మారినా.. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాత మాత్రం మారదు. కప్ కొట్టాలన్న వారి ప్రయత్నం 15వ ఏడాదీ విఫలమైంది.
అభిమానులకు నిరాశే ఎదురైంది. ‘‘ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే)’’ అంటూ బరిలో దిగడం ఉత్త చేతులతో వెనుదిరగడం ఆర్సీబీకి సాధారణమైపోయింది. ద్రవిడ్, కలిస్ వంటి దిగ్గజాల నుంచి గేల్, డివిలియర్స్ వంటి మెరుపు వీరుల దాకా.. కోహ్లి వంటి సూపర్ స్టార్ నుంచి డుప్లెసిస్ వంటి సారథి దాకా ఎంతమంది మారినా ఆర్సీబీ కథ మారడం లేదు.
మళ్లీ నిరాశే..
వాస్తవానికి ఈ సీజన్ లో ఆర్సీబీ సారథ్యం నుంచి కోహ్లి తప్పుకోవడంతో డుప్లెసిస్ కు అవకాశం దక్కింది. దక్షిణాఫ్రికా జట్టును సమర్థంగా నడిపిన అనుభవం ఉన్న డుప్లెసి.. ఆర్సీబీ రాత మారుస్తాడని భావించారు. దీనికితోడు కెప్టెన్సీ ఒత్తిడి లేని కోహ్లి స్వేచ్ఛగా ఆడతాడని అందరూ భావించారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ వంటి హార్డ్ హిట్టర్ ఫామ్ లో ఉండడం.. వెటరన్ దినేశ్ కార్తీక్ మళ్లీ ఫామ్ అందుకోవడంతో ఇక ఆర్సీబీకి తిరుగుండదని భావించారు. కానీ, కోహ్లి వైఫల్యం, బౌలింగ్ లో దారుణ ప్రదర్శన ఆర్సీబీనీ దెబ్బతీసింది.
అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌కు చేరుకోవడం వరుసగా ఇది మూడో ఏడాది. ఈసారి నాలుగో స్థానంలో నిలవడం మరికొంత విశేషం. 2011లో కోహ్లి నాయకత్వంలో ఆర్‌సీబీ మొదటిసారి టైటిల్‌ను కోల్పోయింది. క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. కానీ, ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై విజయం సాధించింది. 2016లో కోహ్లి అత్యద్భుత ఆటతీరుతో బెంగళూరు ఫైనల్ చేరింది. కానీ, సన్ రైజర్స్ టైటిల్ దక్కించుకుంది. చిత్రమేమంటే గత రెండేళ్ల మాదిరే ఈసారి కూడా ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది ఆర్సీబీ. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ చేరేలాగే కనిపించింది.
కోహ్లీ ఏమిటీ వైఫల్యాల పరంపర?
పేసర్ల బౌలింగ్ లో ఆఫ్ స్టంప్ ఆవల పడే బంతులను వేటాడడం, స్పిన్నర్ల బౌలింగ్ లో తడబాటు.. కోహ్లి ప్రధాన బలహీనతలుగా మారిపోయాయి. ఆఫ్ స్టంప్ ఆవల బంతులను వేటాడే లక్షణాన్ని గతంలో వదిలించుకున్న కోహ్లి.. మళ్లీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు. ఈ సీజన్ లో అతడు మూడు, నాలుగు మ్యాచ్‌ల్లోనే మెరిశాడు. కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై 73 పరుగులు చేసినా.. ప్లేఆఫ్స్, ఎలిమినేటర్ లో తేలిపోయాడు. మూడు సార్లు గోల్డెన్ డకౌట్, నాలుగుసార్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. 16 మ్యాచ్‌ల్లో 115.99 స్ట్రైక్‌రేట్‌తో 341 పరుగులు చేశాడు. సగటు 22.73. కాగా 2 అర్ధశతకాలు సాధించాడు.
ఏవిధంగా చూసినా ఇది సగటు ప్రదర్శనే. మాక్స్‌వెల్ అదరగొట్టాడు. అప్పుడు 15 మ్యాచ్‌ల్లో 144.10 స్ట్రైక్‌రేట్‌తో 42.75 సగటుతో 513 పరుగులు చేశాడు. ఈసారి మంచి స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో మినహా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్‌పై 24, లఖ్‌నవూపై 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు చివరి వరకూ క్రీజులో ఉంటే స్కోర్ మరింత పెరిగేది. మాక్సీ 13 మ్యాచ్‌లు ఆడి 169.10 స్ట్రైక్‌రేట్‌తో 301 పరుగులే చేశాడు. సగటు 27.36.
రెండో ఓపెనర్ ఏడి?
బెంగళూరు మరింత ముందుకెళ్లలేకపోవడానికి కారణం సరైన ఓపెనింగ్ జోడీ లేకపోవడం. డుప్లెసిస్, కోహ్లి జాతీయ జట్లకూ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేయలేదు. కాకపోతే ప్రవేటు లీగ్ కాబట్టి ఎవరెక్కడ ఆడాలనేది ఫ్రాంచైజీ ఇష్టం. అయితే, కోహ్లిని ఓపెనర్ గా పంపడం అంత సరికాదు. అతడు పక్కా వన్ డౌన్ బ్యాట్స్ మన్. ఇక డుప్లెసికి సరైన ఓపెనింగ్ జోడీనే లేదు. అనుజ్ రావత్ వైఫల్యంతో ఓపెనర్ గా కోహ్లిని పంపాల్సి వచ్చింది. అనుజ్ 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క అర్ధశతకంతో 129 పరుగులు చేశాడు. సగటు 16.13గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్ 109.32గా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో మహిపాల్ లోమ్రర్‌ది పెద్ద వైఫల్యం. 4 మ్యాచ్‌ల్లో 86 పరుగులే చేశాడు.
ఆల్ రౌండర్ లేనే లేడు
ఆర్సీబీకి మరో పెద్ద లోపం.. నిఖార్సయిన ఆల్ రౌండర్ లేకపోవడం. ఆ స్థానాన్ని షాబాజ్ అహ్మద్‌తో భర్తీ చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. షాబాజ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడినా 219 పరుగులే చేశాడు. సగటు 27.38, స్ట్రైక్‌రేట్ 120.99. ఇతర జట్లలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చక్కటి ప్రదర్శన చేస్తుంటే ఆర్సీబీకి మాత్రం అది సాధ్యం కాలేదు. అందుకనే.. డుప్లెసిస్ (16 మ్యాచ్‌ల్లో 3 అర్ధ శతకాలతో 468 పరుగులు) రాణించినా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఫినిషర్ పాత్రను అద్భుతంగా పోషించినా బెంగళూరు ఫైనల్ కు రాలేకపోయింది. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడం కార్తీక్ ఘనతే. సీజన్ మొత్తం చివరి క్షణాల్లో అదిరిపోయే ప్రదర్శన చేసిన అతడు టోర్నీలోనే మేటి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా 16 మ్యాచ్‌ల్లో 55.00 సగటుతో.. 183.33 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. కానీ, తనకలవాటైన రీతిలో కీలకమైన క్వాలిఫయర్-2లో విఫలమయ్యాడు.
సిరాజ్ తుస్.. హేజిల్ వుడ్ ఫర్వాలేదు
బెంగళూరు తరఫున గత రెండు సీజన్లలో మెరుగైన ప్రదర్శన చేసిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఈసారి నామమాత్రంగానే కనిపించాడు. క్వాలిఫయర్ 2లో ధారాళంగా పరుగులిచ్చాడు. అయితే, హెజిల్‌వుడ్, హర్షల్ పటేల్ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. కానీ బ్యాట్స్‌మెన్ సరిగా ఆడకపోవడం, మంచి ఆల్ రౌండర్ లేకపోవడం దెబ్బతీసింది.