ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు హైదరాబాద్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ పోలీసులకూ పని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లపై దాడులు జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని అమెరికా కాన్సులేట్ కు భారీ భద్రత కల్పించారు. బేగంపేట్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా అన్ని వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
ఇక్కడి యూఎస్ కాన్సులేట్ కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్నంగా తనిఖీలు చేశాకే పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ ప్రభావం జనజీవనంపైనా పడుతోంది. తనిఖీల కారణంగా బేగంపేట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో.. కార్యాలయాలు, కాలేజీలకు వెళ్లేవారు ఉదయం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
ఇరాక్ రాజధాని బగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై డిసెంబర్ 31 రాత్రి ఇరాన్ మద్దతుదారులైన హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుత ఉద్రిక్తతలకు ఈ పరిణామమే ఆజ్యం పోసినట్లయింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని డ్రోన్ల దాడిలో అమెరికా చంపేసింది. సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 80 మంది చనిపోయారు. ఇది ప్రారంభమేనని.. అమెరికాకు బుద్ధి చెబుతామని ఇరాన్ అంటుండడంతో అన్ని చోట్లా భద్రత పెంచారు.