భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్..పరిస్థితి ఏంటి? మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆదాని చేతుల్లోకి వెళ్లిపోతుందా? ఆయనే ఏపీని కొనేయబోతున్నాడా? అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్రంలోని యువత మధ్య జోరుగా సాగుతోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆదానీ.. ప్రపంచంలోని బడా వ్యాపారుల్లో ఒకరు. అంతేకాదు.. రాజకీయంగా గుజరాత్‌లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఆయన చక్రం తిప్పుతున్నారు. ముఖ్యం గా ప్రధాని మోడీ, హొం మంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు కూడా. ఈ నేపథ్యంలోనే మోడీ ఆయనకు అన్ని విధాలా సాయం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఇక, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు.. దెబ్బతిన్నాయి. అనేక పరిశ్రమలు మూతబడ్డా యి. కానీ, ఆదాని మాత్రం 200 శాతం లాభపడడంతోపాటు వ్యాపారాలు జోరుగా పెరిగాయి. ఇక, ఆదానీ కన్ను.. ఏపీలోని పోర్టులపై పడింది. ఈ క్రమంలో ఇప్పటికే గంగవరం పోర్టును ఆదానీ తమ హస్తగతం చేసుకున్నారు. ప్రభుత్వ వాటా మినహా మిగిలిన వాటాను దక్కించుకున్నారు. ఇక తాజాగా కృష్ణ పట్నం పోర్టు కూడా వందశాతం అదానీ సొంతమైంది. గత ఏడాది కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన ఆదానీ గ్రూపు.. కొద్ది రోజుల క్రితం మిగిలిన 25 శాతం వాటాలను కొనుగోలు చేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.
ఈ 25 శాతం వాటా 2,800 కోట్లని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇలా.. మొత్తంగా చూస్తే.. ఆదానీ ఏపీపై భారీ ఎత్తున తన పంజా విస్తరించినట్టుగానే కనిపిస్తోంది. అయితే.. ఇలా చేయడం వల్ల.. ఇక్కడ నుంచి ఎక్స్ పోర్టు అయ్యే సరులకు, ఇంపోర్టు అయ్యేవాటికి కూడా ఆదానీనే రేటులు ఫిక్స్ చేస్తారని.. అంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు కనుక ఆదానీచేతుల్లోకి వెళ్తే.. ఏపీని శాసించే స్థాయికి ఆయన ఎదిగిపోవడం ఖాయమని అంటున్నారు. ఇలా చేస్తే.. యువతకు చాలా దెబ్బ పడుతుందని అంటున్నారు పరిశీలకులు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ యువతకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు.