ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ప‌క్కా...!

Update: 2022-11-29 06:00 GMT
ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయ‌ని, సీఎం జ‌గ‌న్ వేస్తున్న అడుగులు ఆదిశ‌గానే సాగుతున్నాయ ని.. చూస్తున్న ప‌రిణామాలు.. చేస్తున్న ప‌నులు గ‌మ‌నిస్తే.. ఖ‌చ్చితంగా ముంద‌స్తుకు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్టు గానే భావించాల్సి వ‌స్తోంద‌ని సోష‌ల్ మీడియాలో సైట్ల‌లో మోత‌మోగిపోతోంది. ఇదే విష‌యం..హాట్ టాపిక్‌గా కూడా మారింది. అయితే.. నిజంగానే ముంద‌స్తుకు వెళ్తారా? అనేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికైతే.. ఈ విష‌యంపై అటు జ‌గ‌న్ కానీ, ఇటు స‌ల‌హాదారు కానీ.. కాద‌నే చెప్పారు.

జ‌గ‌న్ ఒక్క సారి మాత్రమే స్పందించ‌గా.. స‌జ్జ‌ల మాత్రం రెండు నుంచి మూడు సార్లు రియాక్ట్ అయి.. ముం దస్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. పూర్తిస్థాయిలో ఐదేళ్లు కూడా తాము అధికారంలో ఉంటామ‌ని ప్ర‌క టిం చారు. ఇలా చెప్ప‌డం అయితే.. చెప్పారు బాగానే ఉంది కానీ, తెర‌వెనుక జ‌రుగుతున్న ప‌రిణామాల తోనే అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఎక్క‌డ‌స‌భ పెట్టినా.. సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తున్నారు. తాము 98 శాతం ప‌థ‌కాల‌ను, మేనిఫెస్టోను పూర్తి చేసిన‌ట్టు చెబుతున్నారు.

అదేస‌మ‌యంలో త‌న‌ను చూసి, త‌న పాల‌న‌ను చూసి ఓటేయాల‌ని పిలుపునిస్తున్నారు. ఇక‌, మంత్రుల‌, ఎమ్మెల్యేల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌రింత వేగంగా తిప్పుతున్నారు. కులాల వారీగా స‌మీక్ష‌లు చేస్తున్నారు. అభి వృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టి.. జిల్లాల‌ను సుడిగాలిగా చుట్టేస్తున్నారు.

ఇది ప్ర‌భుత్వ‌ప‌రంగా జ‌రుగుతుం టే.. అదేస‌మ‌యంలో పార్టీలో ఇంచార్జ్‌ల‌ను మార్చ‌డం.. కీల‌క నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం.. వంటివి చేయ‌డం ద్వారా వేడి పుట్టిస్తున్నారు.

సో.. ఇవ‌న్నీ చూస్తే.. ఖ‌చ్చితంగా ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌ని, ముంద‌స్తుగా.. అధికార పార్టీ రెడీ అవుతోంద ని చ‌ర్చ జ‌రుగుతుండ‌డం స‌హ‌జ‌మే. అయితే, నాణేనికి ఇది ఒక వైపు మాత్ర‌మే. కానీ, రెండో వైపు చూస్తే.. రాజ‌ధాని లేని వేడి ప్ర‌జ‌ల్లో ర‌గులుతోంది. ర‌హ‌దారుల దుస్థితి పై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఉద్యోగ క‌ల్ప‌న‌, ఉపాధి లేమి వంటివాటిపై కూడా.. ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌రనేది వాస్త‌వం. ఎలా చూసుకున్నా.. షెడ్యూల్ స‌మ‌యానికే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అంటున్నారు. అయితే.. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఉంది. జ‌న‌వ‌రి నుంచి లోక‌ష్ పాద‌యాత్ర‌, ప‌వ‌న్ బ‌స్సు యాత్ర లు ఉన్న నేప‌థ్యంలో వీటిని ఎదుర్కొనేందుకు.. వ్యూహాత్మ‌కంగా.. ముంద‌స్తు ఎన్నిక‌లు అనే ప్ర‌తిపాద‌న‌ను వైసీపీ నేత‌లే చేయిస్తున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News