రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే ఒక సినిమా హీరోగానే కాదు ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందరికీ తెలిసిందే. అలాంటి కృష్ణంరాజు గారికి విజయవాడ దుర్గ గుడిలో దారుణంగా అవమానం జరిగింది. దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనడానికి వస్తున్నా ముందుగా అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చినా ఏ ఒక్క అధికారి ఆయనను పట్టించుకున్న దాఖలాలు కనపడలేదు.
సామాన్య భక్తులతో కలిసి ఆయన తన కుటుంబ సభ్యులతో ఆరో అంతస్తు వరకు వెళ్లారు. అక్కడివరకు వెళ్ళడానికి ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. మధ్యలో చాలాసార్లు ఆయాసంతో కూలబడిపోయారు. చివరికి అతి కష్టం మీద కృష్ణంరాజు కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇది చూసిన చాలామంది ఆలయ అధికారులను విమర్శిస్తున్నారు. ఆయన వయస్సు కైనా గౌరవం ఇచ్చి ప్రోటోకాల్ అమలు చేస్తే బాగుండేదని వాళ్ళు అంటున్నారు. ఆయన ముందస్తు సమాచారం ఇచ్చే దర్శనానికి వచ్చారని అయినా ఇలా చేయడం బాగోలేదని విమర్శిస్తున్నారు.