కరోనా మహమ్మారి గత సంవత్సరం దేశాన్ని అతలాకుతలం చేసింది. 100 ఏళ్లలో ఒకసారి వచ్చే ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా సిద్ధంగా లేవు. కానీ, ఒక సంవత్సరం తరువాత కూడా పాఠాలు నేర్చుకోకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నిర్లక్ష్యం వహించాయి. ఫలితం ఇప్పుడు కరోనాతో దేశ వినాశనం.. భారతదేశంలో సెకండ్ వేవ్ తో కల్లోలంగా మారింది. కేంద్రప్రభుత్వం విధాన పక్షవాతం,.. ప్రజల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి దాపురించింది.
దేశంలో ఈ కోవిడ్ తీవ్రతకు రాజకీయ నాయకులు కారణమని ప్రజలు.. కాదు ప్రజల నిర్లక్ష్యమే కారణమని నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కానీ, వాస్తవం ఏమిటంటే, మహమ్మారి మనం గుణపాఠం నేర్చుకోవడానికి.. దాని నివారణ కోసం చర్యలు తీసుకోవడానికి మనకు ఏడాదిపాటు తగిన సమయాన్ని ఇచ్చింది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మరోసారి కరోనా బారిన దేశం పడి ఈ విపత్తు సంభవించింది.
రెండో యూపీఏ పాలనలో విధాన పక్షవాతం కాంగ్రెస్ ను ఓడించి ప్రధానిగా నరేంద్ర మోడీని అధికార మెజార్టీతో గెలిపించింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయం లేకపోయినా ప్రజలు మోడీని నమ్మ గెలిపించారు. మోడీ ప్రభుత్వం కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలన చేస్తుందని హామీ ఇచ్చారు. కానీ కనీసం కరోనా విషయాలలోనైనా పరిపాలన తేలిపోయింది. ఇప్పటికే చాలా నెలల గడిచినా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మోడీ సర్కార్ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇటీవలే మోడీసర్కార్ భారతదేశంలోని 150 జిల్లా ఆసుపత్రులలో 162 ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యూనిట్ల కోసం టెండర్లు పిలవడం ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. దీనికోసం కేవలం 201 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాటిని పిఎం కేర్స్ ఫండ్ ద్వారా ఖర్చు చేస్తున్నారు. కరోనా వచ్చి ఏడాది అయినా ఆరు నెలల తరువాత, కేవలం 33 మాత్రమే ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఫలితం ఇప్పుడు భారతదేశం ఆక్సిజన్ కోసం అడుక్కునే పరిస్థితి తలెత్తింది.
భారతదేశం ప్రపంచ ఫార్మసీగా ప్రసిద్ది చెందింది. ప్రపంచంలోని టీకా, మెడిసన్స్ తయారీలో 60 శాతం మనమే ఉత్పత్తి చేస్తున్నాం. అయినప్పటికీ భారతదేశం టీకాల ఉత్పత్తి నత్తనడకన సాగుతున్నాయి. ఈ రేటు ప్రకారం, 2021 చివరి నాటికి భారతదేశం జనాభాలో 30 శాతం మందికి మాత్రమే టీకాలు వేయగలం. కరోనాను నియంత్రించాలంటే దేశ జనాభాలో 80 శాతం మందికి టీకాలు వేయాలని.. అప్పుడే సామూహిక రోగనిరోధక శక్తిని పొందుతారని.. కరోనాను జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
కరోనా టీకాల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)తో విదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, భారత ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. టీకా కనుగొనక ముందే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరప్ పరిశోధనలకు ఉదారంగా నిధులు సమకూర్చాయి. మరియు ముందస్తు కొనుగోలుకు నిధులు కోట్ల రూపాయలను కంపెనీలకు ఇచ్చాయి. భారతదేశం మాత్రం చోద్యం చూసింది. ప్రతిస్పందన చాలా తక్కువగా ఉంది. చాలా ఆలస్యమైంది కూడా. భారతదేశంలో రోజువారీ కొత్త కేసులు మూడు లక్షలను తాకిన తరువాత మాత్రమే భారత ప్రభుత్వం సీరం మరియు భారత్ బయోటెక్ లకు 4500 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం విశేషం..
దేశంలో సెకండ్ వేవ్ ఖచ్చితంగా ప్రభుత్వాలు, ప్రజల పొరపాటు వల్లే వచ్చింది. విధాన పక్షవాతం ఇందులో ఉంది. ఇది బీజేపీ ప్రభుత్వం ఉదాసీతన ముందు చూపు లేని తనం అని చెప్పొచ్చు. దాన్ని సరిదిద్దుకోలేక విమర్శించిన వారి ట్వీట్లను తొలగించేందుకు మాత్రం బీజేపీ ప్రభుత్వం బీజీగా ఉండడం గమనార్హం.