ధూళిపాళ్లకు కరోనా?

Update: 2021-05-06 03:49 GMT
సంగం డెయిరీలో అక్రమాలు చేశారంటూ ఆ డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  రెండు రోజుల నుంచి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు టెస్టులుచేయాలని వారి కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది.

అనంతరం కుటుంబ సభ్యులు ధూళిపాళ్ల నరేంద్రను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు సమ్మతించింది.

ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన రోజున వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రోజున కరోనా టెస్ట్ కూడా చేస్తే నెగెటివ్ వచ్చింది. అయితే పోలీసులు విచారణ పేరుతో అటూ ఇటు తిప్పడంతో ఎక్కడో వైరస్ అటాక్ అయినట్టు కనిపిస్తోంది.

ఇక నరేంద్రతోపాటు అరెస్ట్ అయిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ, మాజీ సహకార శాఖ రిజిస్ట్రార్ గుర్నాధంకు కూడా కరోనా పాజిటివ్ గా వచ్చింది. కేసులు, విచారణ పేరుతో టీడీపీ నేతలకు కరోనా అంటించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News