ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాకు రావడం కష్టమేనా !

Update: 2020-11-18 23:30 GMT
అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ ప్రస్తుతం సక్సెస్​ అయ్యింది. ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన క్లినికల్​ ట్రయల్స్​ 90 శాతం విజయవంతమయ్యాయి. అయితే వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాక్సిన్ స్టోరేజీ అవసరం అనేది క్లిష్టమైన చర్యగా మారింది. అయితే ఈ వ్యాక్సిన్​ ఇప్పుడు భారత్​ కొనుగోలు చేస్తుందా? అనేది సందేహాత్మకంగా మారింది. ప్రస్తుతం భారతదేశ జనాభాకు తగినంత మొత్తంలో పైజర్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. NIT అయోగ్ సభ్యులు (హెల్త్) వీకే పాల్ నేతృత్వంలో కోవిడ్-19 కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.


కానీ, పైజర్ వ్యాక్సిన్ కు రెగ్యులేటరీ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ లోపు కేంద్రం కూడా వ్యాక్సిన్ సేకరణతోపాటు పంపిణీకి సంబంధించి వ్యూహాత్మక అమలు చేయాలని భావిస్తోంది.భారత్​తోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో ఈ వ్యాక్సిన్​ను స్టోర్​చేయడానికి అవకాశాలు లేవు.  మరోవైపు భారతదేశంలో మొత్తం 5 కరోనా వ్యాక్సిన్లపై వేర్వేరు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఐదు వ్యాక్సిన్లలో రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటీస్ భాగస్వామ్యంలో వచ్చే వారం నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

 భారత్ బయోటెక్ స్వదేశీ కోవాక్సిన్, సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ Covishield, జిందాస్ కాడిలా ZyCoV-D, మరో వ్యాక్సిన్ బయోలాజికల్ E.Ltd అభివృద్ధి చెందుతున్నాయి. బేలర్ కాలేజీ మెడిసిన్ డైనవాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్ కూడా ఈ వ్యాక్సిన్ జాబితాలో ఉంది. గతవారమే పైజర్, బయోటెక్ కంపెనీలు తమ కరోనా వ్యాక్సిన్ 90 శాతం ప్రభావంతంగా పనిచేస్తాయని ప్రకటించింది.

మోడెర్నా కూడా తమ వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, సాధారణ ఉష్ణోగత్రలోనే స్టోరేజీ అవసరం ఉంటుందని తెలిపింది. పైజర్ వ్యాక్సిన్ తప్పనిసరిగా 70 డిగ్రీల సెల్సియస్ లో మాత్రమే స్టోర్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఇండియాలో ఈ వ్యాక్సిన్​ రావడం కష్టంగా మారింది.
Tags:    

Similar News