మంగ‌ళ‌గిరి నాడి: లోకేష్‌కు అనుకూల‌మా... ప్ర‌తికూల‌మా..?

Update: 2021-12-12 03:30 GMT
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి, నారా లోకేష్ ఇటీవ‌ల రెండు సార్లు గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వర్గంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న అనూహ్యంగానే జ‌రిగినా.. చాలా కీల‌క‌మైన‌ విష‌యం మా త్రం దీని వెఉక దాగి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో లోకేష్ ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. అయితే.. ఎంత ప్ర‌చారం చేసినా.. చివ‌రాఖ‌రుకు.. త‌ల్లి , భార్య కూడా వ‌చ్చి.. ఇక్క‌డ ప్ర‌చారం చేసినా.. లోకేష్ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. అంతేకాదు.. ఏకంగా 5 వేల ఓట్ల తేడాతో లోకేష్ ఓట‌మి పాల‌య్యారు.

అయితే.. అప్ప‌టి కాక‌లో.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాను మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో త‌ర‌చుగా ఇక్క‌డ‌కు వ‌స్తూ.. పార్టీ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. త‌న‌కు ఉన్న‌ గెలుపు అవ కాశాల‌ను సైతం భేరీజు వేసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణా మాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. తాను గెలుస్తానా? అనే సందేహం లోకేష్‌ను చుట్టుముట్టింది. ఎందుకంటే..కీల‌క‌మైన నాయ‌కుడు, నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న చేనేత నాయ‌కుడు.. మురుగుడు హ‌నుమంత‌రావు.. వైసీపీ పంచ‌న చేరిపోయారు.

ఇక‌, దుగ్గిరాల‌లోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. మ‌రోవైపు.. పార్టీ నేత‌ల మ‌ధ్య ఐక్య‌త క‌నిపించ డం లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. తాను ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటానా? అనేది .. ఇప్పుడు.. లోకేష్ బెంగ‌! ఈ క్ర‌మంలో రెండు రోజుల కింద‌ట ఆయ‌న చాలా ర‌హ‌స్యంగా ఇక్క‌డ ప‌ర్య‌టిం చారు. ఈ క్ర‌మంలో పార్టీ ప‌రిస్థితి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న గెలుపున‌కు ఉన్న అవ‌కాశాలు వంటివాటిని భేరీజు వేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలుపు క‌ష్ట‌మ‌నే భావ‌న స్థానిక నేత‌ల నుంచి వ్య‌క్త‌మైన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి రాజ‌ధాని ఎఫెక్ట్ ప‌నిచేస్తుంద‌ని.. అనుకున్నా.. అది కూడా మంగ‌ళ‌గిరి సైడు ప‌నిచేసే అవకాశం లేద‌నే వాద‌న పార్టీలో వినిపించింది. దీనికితోడు.. నేత‌న్న‌లు.. లోకేష్ నాయ‌క‌త్వానికి వ్య‌తిరేకంగా ఉన్నార‌నే పిడుగు లాంటి వార్త సైతం.. ఈ సంద‌ర్భంగా లోకేష్ చెవిన ప‌డింది. దీంతో ఇప్పుడు.. మంగ‌ళ‌గిరిలోనే పోటీ చేయాలా? ఇలా చేస్తే.. ఓడి పోతే.. మ‌రింత ప‌రువు పోదా? పోనీ.. గెలిచే చోటు ఎంచుకోవాలా? అనేది ఇప్పుడు లోకేష్ కూట‌మిలో అంత‌ర్మ‌థ‌నంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News