బీజేపీ విష‌యంలో జ‌గ‌న్ జాగ్ర‌త్త ప‌డుతున్నాడా...!

Update: 2022-11-19 02:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ముఖ్యంగా త‌న పైనా.. త‌న పార్టీపై నా.. విప‌క్షాలు ఎక్క‌డ యాంటీ ప్ర‌చారం చేస్తాయోన‌ని.. ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారు. దీంతో ఇటీవ‌ల ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల్లో ప్ర‌ధాన అడుగుగా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. విశాఖ‌లో ప్ర‌ధాని పాల్గొన్న పాల్గొన్న స‌భ‌లో జ‌గ‌న్ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రంతో త‌మ‌కు ఉన్న బంధంపై.. ఆయ‌న కీల‌క కామెంట్లు చేశారు. కేంద్రంతో త‌మ‌కు రాజ‌కీయ బంధం లేద‌ని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే.. తాము కేంద్రంతో బంధా న్ని కొన‌సాగిస్తున్నామ‌ని.. తెలిపారు. నిజానికి ఆ స‌భ‌లో ఈ వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు లేదు.  కానీ, ఆయ‌న వెల్ల‌డించారు. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. చాప‌కింద నీరులా ప్ర‌తిప‌క్షాలు.. బీజేపీతో తాము అంట‌గాకుతున్నామ‌ని ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉండ‌డ‌మే.

నిజానికి ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీతో సంబంధం కోసం త‌హ‌త‌హ‌లాడుతోంది. కానీ, బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాక‌పోగా.. ప‌వ‌న్‌ను సైతం టీడీపీతో క‌లిసేందుకు ఒప్పుకోవ‌డం లేద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ క‌నుక రేపు.. బీజేపీని దూరం పెడితే.. ఈ విష‌యంలో వైసీపీపై యాంటీ ప్ర‌చారం ప్రారంభించే అవ‌కాశం ఉంది. మ‌త‌త‌త్వ పార్టీతో జ‌గ‌న్ పొత్తు పెట్టుకున్నార‌ని.. ప్ర‌జ‌ల్లోకి అంత‌ర్లీనంగా ప్ర‌చారం తీసుకువెళ్లే అవ‌కాశం ఉంది.

దీనిని ముందుగానే ప‌సిగ‌ట్టిన‌.. వైసీపీ అధినేత‌.. త‌న జాగ్ర‌త్త‌లు తాను ఇప్ప‌టి నుంచే తీసుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు అంటున్నారు. ఎన్నిక‌ల నాటికి త‌న‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా చూసుకునేందు కు.. బీజేపీతో త‌న‌కు ప్ర‌త్యేకంగా ఎలాంటి సంబంధాలు లేవ‌ని చెప్పుకొనేందుకు ఇప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

దీనివ‌ల్ల రెండు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఒక‌టి.. త‌న‌ను తాను కాపాడుకోవ‌డం.. రెండు టీడీపీ,జ‌న‌సేన‌లు బీజేపీతో ఉన్నాయ‌ని.. వాటి వ‌ల్ల‌జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించ‌డ‌మేన‌ని అంటున్నారు. మొత్తానికి బీజేపీ నేత‌లు గ‌మ‌నించారో.. లేదో కానీ.. జ‌గ‌న్ మాత్రం బీజేపీ విష‌యంలో స్ప‌ష్టంగానే ఉన్నార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News