ఒంట‌రి పోరే.. జ‌న‌సేన‌కు లాభిస్తుందా? పొలిటిక‌ల్ డిబేట్‌

Update: 2022-12-23 13:30 GMT
ఏపీలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చ‌బోనంటూ.. ప‌దే ప‌దే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అందివ‌చ్చిన పార్టీల‌తో పొత్తుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చారు. వాస్త‌వా నికి ఇప్పుడు ఆయ‌న బీజేపీతో పొత్తులోనే ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీని కూడా క‌లుపు కొని ప‌వ‌న్ ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

పొత్తు పెట్టుకుని ఉంటే 2019లో వైసీపీ గెలిచినా.. ఇంత భారీ మెజారిటీ వ‌చ్చేది కాద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించా రు. అంటే.. పొత్తుల‌కు జ‌న‌సేన సిద్ధ‌మ‌నే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడున్న అంచ‌నాలు.. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీతో పొత్తు ఖాయ‌మ‌నే తెలుస్తోంది. అయితే.. ఇలా పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్తే.. 2014 ఎన్నిక‌ల సీన్ తిరిగి వ‌స్తుందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో పొత్తుల‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేది కూడా ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఎందుకంటే.. 2014లో పొత్తు పెట్టు కుని.. రాష్ట్రానికి ప్ర‌త్యేకంగా తీసుకువ‌చ్చిన ల‌బ్ధి అంటూ ఏమీ లేదు. పైగా ప్ర‌త్యేక హోదాను నాశ‌నం చేశార‌నే వాద‌న బ‌లంగా ఉంది. ఇక‌, రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయ‌కుండా తాత్కాలిక క‌ట్ట‌డాల‌తోనే కాలం గ‌డిపార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

పైగా.. బీజేపీని అస‌లు న‌మ్మే ప‌రిస్థితి ఏపీలో క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో పొత్తులు పెట్టుకున్నా ఫ‌లితం ద‌క్కే అవ‌కాశం లేద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అలా కాకుండా..ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేయ‌డం ద్వారా.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 6.5 శాతం ఓటు బ్యాంకును పెంచుకోవ‌డంతోపాటు క‌నీసంలో క‌నీసం 20 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. ప‌వ‌న్‌ను న‌మ్ముతున్న వారు ఉన్నారు కానీ.. పొత్తులు న‌మ్ముతున్న‌వారు క‌నిపించ‌డం లేదు. పైగా పొత్తులు పెట్టుకుంటే వైసీపీకి మ‌రిని ఆయుధాలు ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ దిశ‌గా ఆలోచిస్తారో.. లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News