చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మారణకాండ సృష్టించిన 3 రోజుల తర్వాత మావోయిస్ట్ ల పేరుతో ఓ లేఖ విడుదలైంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ లేఖలో తెలిపారు. మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న జవాన్ ను అప్పగిస్తామని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖలో ప్రకటించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు. చనిపోయినవారి పేర్లు నూపో సురేశ్, ఓడి సన్నీ , కోవాసి బద్రు, పద్దమ్ లఖ్మాగా తెలిపారు. అయితే మావోయిస్టులతో చర్చలకు సంబంధించి పోలీసు ఉన్నతాదికారుల నుంచి ఏటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. బీజాపూర్ దాడి ఘటనలో రాకేశ్వర్ మావోయిస్టులకు చిక్కిన విషయం తెలిసిందే.
ఇక ఎదురు కాల్పుల్లో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు మావోయిస్ట్ లు సానుభూతి తెలిపారు. వారితో మాకు శత్రుత్వం లేదు. ప్రభుత్వాల అన్యాయమైన యుద్ధంలో బలిపశువులు కావద్దని వారికి విజ్ఞప్తి చేశారు మావోయిస్ట్ లు. అంబానీ, అదానీ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు.. వనరుల దోపిడీ చేస్తున్నట్టు ఆరోపించారు. దానికి మావోయిస్టు పార్టీ ఆటంకంగా మారడంతో సైనిక దాడులు చేయిస్తున్నారని మావోయిస్ట్ లు ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అన్ని అధికారాలు ప్రజలకే అనే ‘జనతన’ సర్కార్ల ఏర్పాటే ప్రత్యామ్నాయం’ అని అన్నారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అటవీప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల చెరలో ఉన్న కమాండోని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీప గ్రామాల్లోని వాళ్ల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపక్క ఇన్ ఫార్మర్లనూ రంగంలో దించారు. అటు, ఆ కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. నాన్నను వదిలేయండి అంటూ ఆ కమాండో కూతురు అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తుంది. ఇక , మావోయిస్టులు రాసిన లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందదో చూడాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్ ను విడిపించాలని, వారి కుటుంబ సభ్యులే కాదు యావత్ భారత దేశం డిమాండ్ చేస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. నిజంగా బంధీని క్షేమంగా ఉంచారా లేదా? అన్నదానికి రుజువులు కావాలని డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు.