రాజకీయ రంగంలో ఒక్క చిన్న పరిణామం చూపించే ప్రభావం అంతా ఇంతా అన్నట్లు ఉండదు. పెద్దగా పట్టించుకోని విషయాలు తర్వాతి రోజుల్లో తాడు పామైనట్లుగా మారిపోతుంటాయి. ఎంతగా నిర్లక్ష్యం చేస్తే అందుకు రెట్టింపు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఎవరిదాకానో ఎందుకు.. టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి) అధినేత కేసీఆర్ విషయాన్నే తీసుకోండి. ఆయన పార్టీ పెట్టినప్పుడు.. తెలంగాణ ఉద్యమం అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు ఆయన్ను పట్టించుకున్న వారు ఎవరైనా ఉన్నారా?
కట్ చేస్తే.. పుష్కరం తర్వాత ఒక్కడిగా ఉంటే కేసీఆర్ మహా శక్తిగా మారటం.. రాష్ట్ర రాజకీయాల్ని శాసించటమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎంత పవర్ ఫుల్ అయ్యారో ఇట్టే అర్థమవుతుంది. తనకున్న పరపతిని మరింత పెంచుకోవటానికి జాతీయ స్థాయే లక్ష్యంగా ఆయన ముందుకు రావటం తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన ఆయన.. శుక్రవారం (డిసెంబరు 9) తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ భారీ కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే.
ఒకవైపు ఈ హడావుడి జరుగుతున్న వేళలోనే.. మరోవైపు దివంగత మహానేత వైఎస్ గారాల పట్టి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల న్యాయం కోసం రోడ్డు ఎక్కే పరిణామం చోటు చేసుకుంది. తన పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోటాన్ని నిరసిస్తూ ఆమె అంబేడ్కర్ విగ్రహం ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.అక్కడి నుంచి ఆమెను బలవంతంగా పోలీసులు లోటస్ పాండ్ కు తరలిస్తే.. అక్కడ కూడా ఆమె పచ్చి మంచినీళ్లు తాగకుండా మొండిగా దీక్ష చేస్తున్నారు.
ఎప్పటిలానే కేసీఆర్ సర్కారు ఈ ఇష్యూను పెద్దగా పట్టించుకోకుండా లైట్ గా తీసుకుంటున్న పరిస్థితి. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. అప్పట్లో కేసీఆర్ నోటి నుంచి తెలంగాణ మాట వస్తే ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వాలు పిచ్చ లైట్ తీసుకున్నాయి. కానీ.. తన వాదన మీద నిలబడి అదే పనిగా ప్రయత్నం చేస్తున్న వేళ.. ఒక స్థాయి దాటిన తర్వాత కేసీఆర్ ను నమ్మటం మొదలైంది. ఇప్పుడు షర్మిల విషయంలో అలాంటి పరిస్థితే రిపీట్ అవుతుందన్న మాట ఎవరైనా చెబితే నవ్విపోవచ్చు.
కానీ.. హిస్టరీ రిపీట్ కాకూడదన్న రూలేం లేదు కదా? మొన్నటికి మొన్న షర్మిల కారులో ఉంటే.. టోయింగ్ వెహికిల్ తో ఆమె కారును నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లటం.. దీనిపై ప్రధాన మంత్రి మోడీ సైతం ఆరా తీయటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతలా కేసీఆర్ సర్కారును చిరాకు పుట్టించిన మరో రాజకీయ నేత లేరనే చెప్పాలి.
మరెవరికీ సాధ్యం కానిది.. ఒకరిద్దరికి సాధ్యమవుతుంది. అలాంటి ఒకరిద్దరిలో షర్మిల కూడా ఒకరు కావొచ్చు కదా? అలాంటి అవకాశాన్ని కొట్టి పారేయలేం కదా?
మొన్న టోయింగ్ వెహికిల్ తో ఈడ్చుకు వెళ్లటం.. పాదయాత్రకు కోర్టు ఓకే చెప్పినా.. పోలీసుల నుంచి అనుమతి రాకపోవటం.. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష.. లాంటి ఘటనల్ని చూస్తే షర్మిల విషయంలో కేసీఆర్ లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.
తన లాంటి శక్తివంతమైన అధినేతను ఢీ కొట్టే స్థాయి ఇసుమంత కూడా లేని షర్మిల తననేం చేస్తుందన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ.. ఒకప్పుడు తన విషయంలోనూ అలాంటి తప్పులు చేసిన వారికి కాలం ఎలాంటి సమాధానం చెప్పిందన్న విషయం కేసీఆర్ కు గుర్తుండే ఉండొచ్చు. తన విషయంలో చేసిన తప్పుల్ని.. తాను వేరే వారి విషయంలో తప్పులు చేయటమా? అన్న ప్రశ్న కేసీఆర్ వేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.