మరోసారి కోహ్లీ కి నిరాశేనా ?

Update: 2019-12-20 07:30 GMT
విరాట్ కోహ్లీ ...ఇండియన్ క్రికెట్ టీం పరుగుల యంత్రం .. టీం ఇండియా కెప్టెన్. ప్రస్తుతం ప్రపంచం లో ఉన్న మేటి క్రికెటర్స్ లో కోహ్లీ అగ్ర స్థానంలో ఉన్నాడు. అలాగే భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి తిరుగులేని రికార్డుంది. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా ఏ ఫార్మాట్లో చూసినా కోహ్లి కెప్టెన్సీ రికార్డు అమోఘం. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా ఎన్నో విజయాలు, ఘనతలు, రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆలా అందరికి ఎంతో స్ఫూర్తిమంతమైన సారథిగా కనిపిస్తాడు.

కానీ , ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి వచ్చేసరికి బ్యాట్ మెన్ గా విశేషంగా రాణిస్తున్నప్పటికీ కూడా కెప్టెన్ గా పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. కోహ్లీ  సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్‌లో ఎంత చెత్త రికార్డ్ ఉందొ తెలిసిందే. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. ఇంతకు ముందు టైటిల్‌‌కు రేసులో అయినా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ప్లేఆఫ్‌కు చేరడం కూడా  రాయల్ ఛాలెంజర్స్ కి   కష్టమవుతోంది. పాయింట్ల పట్టికలో కింది వరుసకే పరిమితం అవుతోంది. ప్రతిసారీ బెంగళూరు అభిమానులు ‘ఈ సాలా కప్ నమదే’ అనుకోవడం.. కోహ్లీ జట్టేమో గ్రౌండ్ లో బొక్కబోర్లా పడటం మామూలైపోయింది.

వేలంలో తెలివిగా వ్యవహరించలేకపోవడం, సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోవడం, కూర్పు తేడా కొట్టడమే ఆ జట్టు వైఫల్యానికి ప్రధాన కారణాల్లో ఒకటనడంలో సందేహం లేదు. ఈసారైనా జాగ్రత్త పడతారని అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ ‌రౌండర్ క్రిస్ మోరిస్ మీద బెంగళూరు ఏకంగా రూ.10 కోట్లు పెట్టేసింది. మోరిస్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమి ఐపీఎల్ లో చేయలేదు. అలాంటి ఆటగాడికి పది కోట్లు పెట్టడం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైపోయి ‘ఔట్ డేట్’ జాబితాలోకి చేరిపోయిన స్టెయిన్‌ను 2 కోట్లు పెట్టి ఇదే ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్, అదే దేశానికి చెందిన కేన్ రిచర్డ్ సన్‌ల కొనుగోలు పర్వాలేదు. కానీ , ఎంతమంది ప్లేయర్స్ ఉన్నప్పటికి కూడా వారిని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్న బెంగుళూరు ఈసారి ఏ ప్రణాలికలతో వస్తుందో మరి.. కానీ , ఎప్పటిలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ..మరోసారి ‘ఈ సాలా కప్ నమదే అని అంటున్నారు.
Tags:    

Similar News