కవితకు ఎమ్మెల్సీ.. కేటీఆర్ కు ఇష్టం లేదా?

Update: 2020-03-21 01:30 GMT
తెలంగాణకు అధికారిక సీఎం కేసీఆర్. ఇక అనధికారిక సీఎం కేటీఆర్ అంటుంటారు.. ప్రజా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, ట్విట్టర్ లో యమ యాక్టివ్ గా ఉండే కేటీఆర్ వేగంగా స్పందిస్తూ తెలంగాణ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. కేసీఆర్ తర్వాత తెలంగాణలో కేటీఆర్ చెబితేనే పనులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో కేసీఆర్ ను సైడ్ చేసి బదిలీలు.. ఇతర మంత్రుల కేటాయింపుల్లోనూ కేటీఆర్ ముద్ర స్పష్టం గా కనిపిస్తోంది.

ఇలా తెలంగాణలో తిరుగులేని విధంగా ఉన్న కేటీఆర్ కు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పోటీ వచ్చిందా? తన చెల్లెలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా రావడం కేటీఆర్ కు ఇష్టం లేదా? కవితను ఎందుకు కేటీఆర్ స్వాగతించ లేదన్నది ఇప్పుడు గులాబీ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.

నిజామాబాద్ లో ఓడిపోయాక కవిత మౌనంగా ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి కవితను నిజామాబాద్ ఎమ్మెల్యేలంతా కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా దగ్గరుండి నిలబెట్టారు. కవిత నామినేషన్ సందర్భంగా గులాబీ శ్రేణులతా హడావుడి చేశాయి.

మంత్రి హరీష్ రావు, సోదరుడు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ లు కవితను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. కానీ ప్రతీ విషయంలోనే వేగంగా స్పందించే కేటీఆర్ తాజాగా కవితకు శుభాకాంక్షలు కూడా ట్విట్టర్ లో తెలుపకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం తెలంగాణలో అధికార కేంద్రంగా కేటీఆర్ ఉన్నారు. కవిత ఎంట్రీ ఇస్తే మంత్రి లేదా పెద్ద పదువులు చేపడితే తనకు పోటీ వస్తుందనే ఉద్దేశంతోనే కవిత రాకను కేటీఆర్ ఆహ్వానించలేదా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కవితకు శుభాకాంక్షలు తెలుపుకపోవడంతో ఇదే నిజమని శ్రేణుల్లో చర్చ కూడా జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో.? అబద్దమెంతో కానీ ఈ న్యూస్ వైరల్ గా మారింది.
Tags:    

Similar News