బీహార్ ​లో ‘పొగ’ మొదలైందా? .. నితీశ్​ లో ఎందుకంత నైరాశ్యం?

Update: 2020-12-28 13:34 GMT
బీహార్​లో బీజేపీ సపోర్ట్​తో సీఎం పదవి చేపట్టిన నితీశ్​ కుమార్​కు ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారా? ఏ క్షణంలో నైనా ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా? అంటే అవుననే సమాధానమే ఇస్తుంది. మొత్తం 243 స్థానాలకు గానూ గత ఎన్నికల్లో బీజేపీకి 63 సీట్లు, జేడీయూ 57 సీట్లు వచ్చాయి. అయితే ఇక్కడ బీజేపీ సపోర్ట్​తో నీతీశ్​ సీఎం పదవిని చేపట్టారు. ఆయనకు సొంతంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం, స్వేచ్ఛ లేవు. ఈ క్రమంలో ఆయన సీఎం పీఠం ఎక్కినప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు.

అయితే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం నితీశ్​కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో జరిగిన పెట్టిన పొగ.. బీహార్​లో ఉన్న నితీశ్​ తాకింది. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందులో ఆరుగురు నితీశ్​కు గుడ్​బై చెప్పి బీజేపీలో చేరారు. మరోవైపు బిహార్​లోనూ పలువురు ఎమ్మెల్యేలు నితీశ్​కు హ్యాండ్​ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న నితీశ్​కు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. ‘ఈ సీఎం పదవి నాకు అక్కర్లేదు’ అంటూ ఆయన తీవ్ర నైరాశ్యంతో మాట్లాడటం ఇందులో భాగమే.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. సరిపడా ఎమ్మెల్యేలు ఆయన వెంట లేరు. దీంతో ఏం చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీలో కలిపేసుకోవడం పొత్తు ధర్మానికి విరుద్ధమని జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు.

జేడీయూ కొత్త అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.

‘మా సంస్కారాన్ని చేతగానితనంగా చూడొద్దు’ అంటూ ఆయన బీజేపీ నేతలకు కౌంటర్​ ఇచ్చారు.

మరోవైపు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ కూడా కఠిన వ్యాఖ్యలు చేశారు.. ‘నిజానికి నాకు సీఎం పదవి మీద ఆసక్తి లేదు. ఈ విషయాన్ని ఎన్నికల రోజే స్పష్టంగా చెప్పాను.

నేను పదవి చేపట్టి నెలరోజులైంది. నేను ఇప్పటికీ ఇదే మాటమీద ఉన్నాను. ప్రజలు బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన వ్యక్తే సీఎం పీఠం మీద కూర్చొవచ్చు’ అంటూ ఆయన నైరాశ్యంగా వ్యాఖ్యానించారు.



Tags:    

Similar News