ఎన్టీఆర్ .. ఈ పేరు కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో , దేశ రాజకీయాలలో ఒక చరిత్ర ఉంది. సినిమాల్లో అగ్ర హీరోగా కొనసాగిన అన్న నందమూరి తారక రామారావు ..తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశాన్ని స్థాపించి .. పార్టీ పెట్టిన కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ తరువాత జరిగిన అనూహ్య పరిణామాలు , మారిన రాజకీయాల గురించి అందరికి తెలిసిందే. ఇక మధ్యలో గత పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం రాష్ట్రం మొత్తం ప్రచారం చేసాడు. కానీ ,ఆ ఎన్నికల తరువాత అసలు పార్టీలో ఎన్టీఆర్ ఊసే లేదు. దీనితో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి తేరా పడిపోయింది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ..స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు బాగా చర్చకు వస్తుంది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ అధినాయకులు చంద్రబాబు, లోకేష్‌లపై ధాటిగా విమర్శలు చేస్తూ, పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. లోకేష్ కోసమే, జూనియర్‌ను పక్కనపెట్టారని వ్యాఖ్యానించడంతో, టీడీపీలో జూనియర్ ఎందుకు సైలెంటయ్యాడని కొన్నేళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అవసరానికి వాడుకొని ఎన్టీఆర్ ని పదేళ్లుగా ఎందుకు పక్కనపెట్టారని వంశీ , ఎన్టీఆర్ కు అప్పగిస్తే పార్టీ బ్రతుకుతుంది అని నాని టీడీపీ పై విమర్శలకి దిగారు. దీనిపై టీడీపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. టీడీపీ కి ఎవరి సహాయం అవసరంలేదు అని , చంద్రబాబు ఒక్కడే చాలు అని చెప్తున్నారు. అలాగే వర్మ తీస్తున్న తాజా చిత్రం ..కమ్మరాజ్యంలో కడపరెడ్లు లో కూడా ఎన్టీఆర్ ప్రస్తావన ఉండేలా ఉంది. దీనితో టీడీపీలో తారక్ పాత్ర ఏంటి అని మళ్లీ చర్చలు నడుస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్. తాతయ్య పోలికలు. తాతయ్యలా అనర్గళ ప్రసంగాలు. అదిరిపోయే పంచ్‌లు. మాస్‌ను ఆకట్టుకునే హావభావాలు. ఎన్టీఆర్ నిజంగా ఒక ఛరిష్మాటిక్ యాక్టర్. 2009లో జూనియర్ ర్యాలీలకు వేలాది జనం తరలివచ్చారు. కానీ , ఆ తరువాత లోకేష్‌కు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. జూనియర్‌ను పక్కనపెట్టడమో, జూనియరే పక్కకుపోవడమో జరిగిపోయాయి. కొన్నాళ్లు సినిమాలు పక్కనపెట్టి, క్యాంపెయిన్‌కు వెళ్లి వస్తూ యాక్సిడెంట్‌కు గురై, పార్టీకి ఏదో చెయ్యాలని తపించిన తన కొడుకు జూనియర్‌ను, సైడ్ ట్రాక్ చెయ్యడాన్ని మహానాడు సాక్షిగా జీర్ణించుకోలేకపోయారు హరికృష్ణ. దీంతో తర్వాతి కాలంలో అటు హరికృష్ణతో పాటు జూనియర్ కూడా టీడీపీకి దూరం జరుగుతూ వచ్చారు. హరికృష్ణ చనిపోయారు. ఆ తర్వాత హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు రంగంలోకి దింపినా, జూనియర్ మాత్రం ప్రచారానికి రాలేదు. దీంతో టీడీపీకి, జూనియర్‌కు మధ్య మరింత అగాధం పెరిగిందన్న అభిప్రాయం బలపడింది.
అసలు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఎందుకు తెరమీదకి వస్తుందంటే .. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి చంద్రబాబుకు వయసు మీదపడటం. మరొకరి టీడీపీ కి భవిష్యత్ నాయకుడు అని ప్రచారం జరుగుతున్న లోకేష్ లో పార్టీ ని నడిపేంత నాయకత్వ లక్షణాలు లేకపోవడం మరొకటి. అందుకే టీడీపీ కాల గర్భంలో కలిసిపోకుండా ఉండాలి అన్న , సీఎం జగన్ కు దీటుగా పార్టీని నడిపించి, కార్యకర్తల్లో విశ్వాసం నింపాలన్న ఒక్క ఎన్టీఆర్ తోనే సాధ్యం అవుతుంది అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని టీడీపీలో ఒకవర్గం నేతలే బలంగా కోరుతున్నారు. కానీ , ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. తన తాత స్థాపించిన పార్టీకి తాను విధేయుడినని, ఆయన ఆశయాల కోసం ఆయన స్థాపించిన పార్టీకి సేవ చేయడం తన బాధ్యతన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని పార్టీకి సేవ చేస్తానని మాత్రం చెప్పలేదు.
మొత్తంగా చూసుకుంటే .. మాజీ సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్ కోసం తనకు తానుగా జూనియర్‌ను ఆహ్వానించే అవకాశం లేదు. బాబు, లోకేష్ నేతృత్వంలోని పార్టీలోకి తారక్ వచ్చే ఛాన్సే లేదు. దీన్ని బట్టి చూస్తే ... జూనియర్ మాత్రం రాబోయే కాలంలో సొంతగా పార్టీ స్థాపించడమో లేదంటే పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడమో జరగడం మాత్రం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ , ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ ..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.