భీమవరం.. నీళ్లొదిసినట్లేనట..

Update: 2019-04-09 07:55 GMT
ఎన్నికలకు ఇంకా రెండు రోజులే టైం.. రాష్ట్రమంతా తన పార్టీ అభ్యర్థుల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తను పోటీచేస్తున్న నియోజకవర్గాలపై మాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదు. గాజువాక, భీమవరం సర్వేల గాలి కూడా ఇప్పుడు పవన్ ను కలవరపెడుతోందట..

కేవలం కాపు ఓట్లు అధికంగా ఉన్నాయన్న కారణంతోనే పవన్ ఈ రెండు స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే పవన్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంతా తిరుగుతున్నా ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ తరుఫున ఎన్నికల బాధ్యతలు నిర్వహించే వారు లేకుండా పోయారు. కింది స్థాయి కార్యకర్తలు ఉన్నా డబ్బులు ఖర్చు చేసేందుకు ప్రచారాన్ని ముందుండి నడిపించేందుకు రావడం లేదు. దీంతో రెండు నియోజకవర్గాల్లో కాపులు పవన్ కే వేస్తారన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఈ రెండు స్థానాల్లో బరిలో ఉన్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పవన్ స్థానికుడు కాదని.. గెలిచినా ఇక్కడ ఉండడని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ డ్యామేజ్ పవన్ ను తీవ్ర గందరగోళానికి దారితీసింది.అందుకే గాజువాకలో అద్దెకు ఓ ఇంటిని తీసుకొని తాను ఇక్కడే ఉంటానని సంకేతాలు పంపాడు.

కానీ ఇక్కడే చిక్కు వచ్చి పడింది. గాజువాకలో ఇల్లు తీసుకొని ఉంటానన్న పవన్.. భీమవరం విషయాన్ని మాత్రం వదిలేశాడు. దీంతో భీమవరంలో ఉన్న కాపులు , ప్రజలు పవన్ గాజువాకనే ఎంచుకుంటారని.. గెలిచాక తమ నియోజకవర్గానికి రాజీనామా చేస్తాడని బలంగా ముద్ర వేసుకున్నారు. అందుకే భీమవరంలో పవన్ ను గెలిపించడం వేస్ట్ అని అందరూ డిసైడ్ అయిపోయారని వార్తలు వెలువడుతున్నాయి. గాజువాకకు ప్రాధాన్యమిస్తున్న పవన్ .. భీమవరాన్ని పట్టించుకోవడం లేదని జనం కూడా ఆసక్తి చూపడం లేదట.. ఇలా భీమవరంను పవన్ వదిలేసినట్టేనన్న ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకోవడంతో వివరణ ఇచ్చుకోలేక పవన్.. జనసేన కార్యకర్తలు నానా అవస్థలు పడుతున్నారట.. ఇలా భీమవరంలో పవన్ కు వీస్తున్న ఎదురుగాలి.. ఆయన ఓటమికి దారితీయవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
    

Tags:    

Similar News