పైలట్ రోహిత్‌రెడ్డి. ఇటీవల కాలంలో ఈయన పేరు తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా మార్మోగిపో యింది. హుస్నాబాద్‌లో మునుగోడు ఉప ఎన్నిక ముందు జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. అనంతర రాజకీయాల్లో పైలట్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. మునుగోడులో అప్పట్లో నిర్వహించి న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు కూడా. ఆయనను తెలంగాణ నిజమైన బిడ్డగా కీర్తించారు.
ఇదిలావుంటే, పైలట్ ఇమేజ్ పెరిగిందని.. సీఎం కేసీఆర్ ఆయనను అక్కున చేర్చుకుంటున్నారని.. పైలట్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని తాండూరులో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. నిజానికి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి.. బీఆర్ ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిపై విజయం దక్కించుకున్నారు. అనంతరం.. ఆయన కేసీఆర్‌కు చేరువయ్యారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఖాయమని అనుకున్న పట్నంకు.. ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురు కాగా.. ఎమ్మెల్యేల కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌కు కేసీఆర్ సహా కేటీఆర్ ఆశీస్సులు పుష్కలంగా లభిస్తున్నాయి.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకేనని పైలట్ ధీమాగా ఉన్నారు. అంతేకాదు.. అనంతరం.. ఏర్పడే బీఆర్ ఎస్ సర్కారులో తనకు మంత్రి పదవి కూడా దక్కుతుందని లెక్కులు వేసుకుంటున్నారు.
ఇదే విషయాన్ని పైలట్ అనుచర వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదిలావుంటే.. పట్నం మహేందర్‌రెడ్డి మరోవైపు.. కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇప్పటి వరకు తనకు తిరుగులేదని.. పార్టీ హైకమాండ్ నుంచి తనకు ఆశీస్సులు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని అంటున్నారు.
అయినా మనసులో ఎక్కడో ఆయనకు సందేహం ఉంది. ఈ క్రమంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.