ఏపీ-తెలంగాణల మ‌ధ్య 'ఇచ్చి-పుచ్చుకోవ‌డం' మారుతోందా?

Update: 2022-08-29 07:31 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలైనా తెర‌మీదికి రావొచ్చు. ప‌రిస్థితులు ఎప్పుడు ఎలాగైనా మారొ చ్చు. ఈ విష‌యంలో ప‌రిస్థితులు.. ప్రాధాన్యాలు మారుతుంటాయి. ఎప్ప‌టిక‌ప్పుడు.. మారే ఈ ప‌రిణామాలు ప్ర‌జ‌లకు ఆశ్చ‌ర్యంగా ఉండొచ్చుకానీ.. నాయ‌కుల‌కు మాత్రం కాదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. తెలంగాణ ప్ర‌భుత్వం.. బాహాటంగానే ఏపీని స‌మ‌ర్థించింది. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని కోరుకుంది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్ నేత‌లు.. స‌రిహ‌ద్దు జిల్లాల్లో చ‌క్రం తిప్పార‌నే వాద‌న ఉంది.

ఈక్ర‌మంలో త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ వంటి మంత్రులు.. ఏపీలో తిరిగి... త‌మ వ‌ర్గాన్ని వైసీపీకి అనుకూ లంగా మార్చారు. ఇక‌, నిధులు కూడా కొంత మేర‌కు ఇచ్చార‌నే ప్ర‌చారం అప్ప‌ట్లో ప్రతిప‌క్షాల నుంచి సాగింది. క‌ట్ చేస్తే..దీనికి ముందు 2018లో జ‌రిగిన తెలంగాణ ముందస్తు ఎన్నిక‌ల్లో.. వైసీపీ కూడా తెర‌చాటు న కేసీఆర్‌కు స‌హ‌క‌రించింద‌నే.. వాద‌న వినిపించింది. వైసీపీ సొంత మీడియా కేసీఆర్‌కు అనుకూలంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసింది. అంతేకాదు... అస‌లు పోటీలో లేకుండా కేసీఆర్‌కు కొంత త‌ల‌నొప్పి త‌గ్గించింది.

ఇలా.. ఈ రెండురాష్ట్రాలు.. పార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణులు.. ఆస‌క్తిగా మారాయి. అయితే.. ఇప్పుడు ఈ ప‌రిణామాలు ఇలానే ఉన్నాయా?  వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తెలంగాణ‌కు ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం అనుకూలంగా మారుతుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం.

అయితే.. ఈ విష‌యంలో బీజేపీ నాయ‌కులు.. వ్యూహాత్మ‌కంగా వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం నుంచి.. జ‌గ‌న్‌కు ఇప్పుడు అన్ని విధాలా స‌హ‌కారంఅందుతోంద‌ని.. ఆయ‌న మోడీ రుణం తీర్చుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని.. తాజాగా ఓ కీల‌క నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

ఓ మీడియాకు వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలో స‌ద‌రు నాయ‌కుడు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేయాల్సిన చారిత్ర‌క అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనికి పొరుగురాష్ట్రం నుంచి కూడా స‌హ‌కారం ఉంటుంద‌ని.. అన్నారు. ఎందుకంటే.. మోడీ..ఏపీకి ఎంతో చేశార‌ని.. అక్క‌డ ముఖ్య‌మంత్రికి.. 'ఇబ్బందు లు' రాకుండా చూసుకుంటున్నార‌ని.. సో.. మోడీ రూపంలో మాకు సాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

అంటే.. వైసీపీ ఏదైనా.. తెలంగాణ కు సాయం చేయాల్సి వ‌స్తే.. అది బీజేపీకే చేయాల్సి వ‌స్తుంద‌ని.. స‌ద‌రు నాయ‌కుడు బాహాటంగానే చెప్పారు. దీనిని బ‌ట్టి.. తెలంగాణ‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ సాయం.. బీజేపీ కోరే అవ‌కాశం క‌నిపిస్తోంది. లేక‌పోయినా.. టీఆర్ ఎస్‌కు మాత్రం సాయం చేయొద్ద‌ని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. సో.. ఈ ప‌రిణామాల‌ను గ్ర‌హిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇచ్చి-పుచ్చుకునే వ్య‌వ‌హారంకీల‌క మ‌లుపు తిరుగుతుంద‌ని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News