రాహుల్ సస్పెన్స్ లో ఉంచుతున్నారా?

Update: 2022-09-10 09:53 GMT
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి విషయంలో సస్పెన్స్ మైన్ టైన్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం తాను పోటీచేయాలా వద్దా అన్న విషయం సమయం వచ్చినపుడు తెలుస్తుందన్నారు. భారత జోడో యాత్రలో భాగంగా తమిళనాడులోని నాగర్ కోయిల్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తునే రాహుల్ మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష పదవి ఇప్పటికే తాను నిర్ణయం తీసేసుకున్నట్లు చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయకపోతే ఎందుకు పోటీ చేయడం లేదు అనే విషయాన్ని అప్పుడే వివరణ ఇస్తానని చెప్పారు.

రాహుల్ తాజా ప్రకటన ప్రకారం ఆయనసలు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారా లేదా అనే విషయమై ఉత్కంఠ పెరిగిపోతోంది. పార్టీ సారధ్య బాధ్యతలను రాహులే తీసుకోవాలనే డిమాండ్లు పార్టీలోని మెజారిటి నేతల నుండి పెరుగుతోంది. ఇదే సమయంలో సారథ్య బాధ్యతలను గాంధీయేతర కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్లు కూడా అక్కడక్కడ వినబడుతోంది.

ఏదేమైనా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకే రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పేరుకు రాహుల్ అధ్యక్షుడే కానీ ఏ నిర్ణయాన్ని కూడా స్వేచ్చగా తీసుకుని అమలు చేయలేకపోయారు.

కారణం ఏమిటంటే రాహుల్ తీసుకున్న నిర్ణయం నచ్చని సీనియర్ నేతల కోటరీ అదే విషయాన్ని సోనియాగాంధీతో మాట్లాడి రాహుల్ పై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపణలున్నాయి. మధ్యప్రదేశ్ సీఎంగా జ్యోతిరాధిత్య సింథియాను ఎంపికచేయాలని రాహుల్ అనుకుంటే కోటరీ మాత్రం సోనియా ద్వారా కమలనాథ్ ను కుర్చీలో కూర్చోబెట్టింది.

అలాగే రాజస్ధాన్ కు సచిన్ పైలెట్ ను సీఎం చేయాలని రాహుల్ అనుకుంటే అశోక్ గెహ్లాత్ అయ్యారు. ఇలాంటి అనేక విషయాల్లో రాహుల్ స్వేచ్చగా అమలుచేయలేకపోయినట్లు పార్టీలోనే అప్పట్లో చర్చ జరిగింది.

తాను పేరుకుమాత్రమే అద్యక్షుడినని వ్యవహారాలు నడిపేదంతా సోనియాను అడ్డంపెట్టుకుని కోటరీయే అని రాహుల్ కు అర్ధమైంది. అందుకనే అర్ధాంతరంగా అధ్యక్ష బాధ్యతలను వదిలేసుకున్నారు. గులాంనబీ ఆజాద్ లాంటి సీనియర్లు ఒక కోటరీగా తయారై తనను ఒక బొమ్మలాగ ఆడిస్తున్నట్లు రాహుల్ కు అర్ధమైపోయింది. ఇందుకనే అధ్యక్షబాధ్యతల విషయంలో రాహుల్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News