సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఓ సైకోనా అంటే అవుననే అంటున్నారు.. ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి. ఈ మేరకు ఒక టీవీ చానెల్ తో మాట్లాడుతూ యువరాజుపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ అరేబియా పర్యటనకు వస్తున్న వేళ సాద్ అల్ జాబ్రి వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి.
టీవీ చానల్ ఇంటర్వ్యూలో సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని ఆరోపించారు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.
ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది మహ్మద్ బిన్ సల్మాన్ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. యువరాజుజు భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అన్నాడు. గత అనుభవాల నుంచి ఆయన ఏమాత్రం నేర్చుకోలేదన్నారు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తానే సాక్షినని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించారు.
కాగా సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించారని సమాచారం. అల్ జాబ్రి అప్పట్లో సౌదీ యువరాజుగా ఉన్న మహ్మద్ బిన్ నయేఫ్ సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్‌ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. దీంతో భయపడిన అల్ జాబ్రి తన ప్రాణాలకు ముప్పు ఉందన్న భయంతో కెనడాకు పారిపోయాడు. ఇప్పుడక్కడ ఆయన ప్రవాస జీవితం గడుపుతున్నారు.
మరోవైపు అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని మండిపడింది.
గతంలో టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన రెండు వారాల తర్వాత 2018లో టొరంటోలో తనను చంపేందుకు సౌదీ యువరాజు తన కిరాతక ముఠాను పంపారని ఆరోపిస్తూ 2020లో అల్ జాబ్రి సౌదీ యువరాజుపై అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసు వేశారు. యువరాజు తనను ఏదో ఒకరోజు చంపేయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ ప్రభుత్వం, రాజ కుటుంబానికి చెందిన సున్నితమైన సమాచారం తన వద్ద ఉండడమే అందుకు కారణమని అన్నారు.