అజర్ బైజాన్, ఆర్మేనియాల మధ్య మూడు సంవత్సరాల కింద భీకర పోరు సాగింది. నగోర్నో-కరబాఖ్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో వందల కొద్దీ ప్రాణాలు పోయాయి. ఆ తరువాత రష్యా జోక్యం చేసుకొని ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఏర్పరిచి కాల్పుల విరమణకు సహకరించింది. అయితే తాజాగా అజర్ బైజాన్ లో ఇప్పుడు ప్రజా ఉద్యమాలు మళ్లీ మొదలయ్యాయి. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందంటూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.
గతంలో అజర్ బైజాన్ కు రష్యా వెన్నంటే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంతో తనను కాపాడుకునే పనిలో నిమగ్నమైంది. ఈ తరుణంలో యూరప్ దేశాలో జోక్యం చేసుకొని రష్యాపై కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టాయి. అదేంటంటే..?
గత నెల రోజులుగా ఆర్మేనియా నాగర్ కార్డూన్ అనే ప్రధాన హైవేని దిగ్బంధించింది. దీంతో అజర్ బైజాన్ కు వెళ్లాల్సిన సరుకులు అందడం లేదు. దీంతో ఆహార కొరతతో ఆ దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జబ్బున బారిన పడ్డవారికి ఆసుపత్రుల్లో మందుల్లేక అల్లాడి పోతున్నారు. అయితే వాస్తవానికి అజర్ బైజాన్ రష్యాకు మద్దతు ఇస్తూ వస్తోంది. ఆ దేశానికి పలు సందర్భాల్లో రష్యా సాయం చేస్తూ వస్తోంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఉక్రెయిన్ తో పోరు కారణంగా తనను తాను కాపాడుకోవడానికే ముప్పు తిప్పలు పడుతోంది.
ఈ తరుణంలో అమెరికా కొత్త ప్రచారం మొదలు పెట్టింది. రష్యాను నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని అంటోంది. తమని నమ్మకున్న ఉక్రెయిన్ ఇప్పుడు ఎంతో బాగుందంటూ చెబుతోంది. అయితే అమెరికా చేస్తున్న ఈ ప్రచారానికి రష్యా సమాధానం చెప్పలేకపోతోంది. అటు తనకు మద్దతు ఇచ్చే అజర్ బైజాన్ కు సాయం చేయలేని పరిస్థితి. అయితే ఆధిపత్య పోరు కారణంగా అజర్ బైజాన్ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కనీస అవసరాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు.
ఇప్పటికే రష్యాకు అనుకూలంగా ఉన్న దేశాలపై యూరప్ పగ తీర్చుకుంటోంది. ఆ దేశానికి మద్దతు ఇచ్చే వాటికి పొరుగు దేశాలతో చిచ్చుపెట్టి ఆందోళనలు ప్రేరేపిస్తోంది. ఇప్పుడు ఇరుకున పడ్డ రష్యా ఓ వైపు ఉక్రెయిన్ తో పోరు చేస్తూ తన మద్దతు దేశాలను కాపాడలేని పరిస్థితిలో ఉంది. అయితే భారత్ లాంటి దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా ఏ దేశానికి పూర్తి సహకారం అందించలేని స్థితి. ఇప్పటికే అటు ఉక్రెయిన్, ఇటు రష్యాతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకున్న భారత్ ఇప్పుడు అజర్ బైజాన్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.