ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తాము లెక్కకు మిక్కిలిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. అవే తమను గెలిపిస్తాయని వైసీపీ అధినేత జగన్ ఆశలు పెట్టుకున్నారు. ఇక డబ్బులు పంచడం తప్ప రాష్ట్రంలో ఏ అభివృద్ధీ లేదని.. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తే తమను గెలిపిస్తుందని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి.
మరోవైపు జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి మరోసారి అధికారం కష్టమనే భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇప్పటికే ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో తిప్పుతున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు వర్క్‌షాపులు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు.
పవన్ విశాఖ పర్యటన, ఇప్పటం వివాదం, నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడి వంటి కారణాలతో ప్రతిపక్ష నేతలకు మైలేజీ పెరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న జగన్ మరోమారు వర్క్‌షాపు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తోంది. జగన్‌కు రిపోర్టులు సమర్పిస్తోంది. వీటన్నింటిపైనా, గడప గడపకు సరిగా వెళ్లని ఎమ్మెల్యేలకు వర్క్‌షాప్‌లో జగన్ క్లాసు తీసుకుంటారని చెబుతున్నారు.
గతంలో జరిగిన వర్క్‌షాపుల్లో జగన్ కొంతమంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొందరు సరిగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. వీరికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
ఇప్పుడు ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయనే వార్తల నేపథ్యంలో జగన్ మరోమారు వర్క్‌షాపు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ కిశోర్ నివేదికలు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష ఈ సమావేశంలో ఉంటాయని చెబుతున్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? లేదా? సమస్యల పరిష్కారం కోసం చూపుతున్న చొరవ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారని తెలుస్తోంది.
పనితీరు బాగోనివారికి, గతంలో హెచ్చరించినా ఇంకా మారని వారికి ఈసారి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.