ఏమాటకు ఆమాట చెప్పుకోవాల్సి వస్తే.. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల మూడ్ రాలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమరానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినప్పటికీ.. ప్రతిపక్షా లు మాత్రం హడావుడి చేస్తున్నాయి. మంచిదే. అయితే.. రాష్ట్రంలోని ఒక జిల్లాలో మాత్రం వైసీపీ నాయకులు అప్పుడే ఎన్నికలు వచ్చేసినంత పనిచేస్తున్నారు. నాయకులు దాదాపు అందరూ కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు.
అదే.. ఉమ్మడి అనంతపురం జిల్లా. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా.. సగానికిపైగా నియోజకవ ర్గాల్లో వైసీపీ నాయకులు పట్టు సాధించేశారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లోఅయితే.. అసలు ప్రతిపక్ష నేతలు నామినేషన్లు వేసే పరిస్థితి కూడా లేదని అప్పుడే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ఇప్పటి నుంచే అక్కడ వైసీపీ నాయకులు భారీ ఎత్తున పైరవీలు చేస్తున్నారు.
ఎన్నికల సమయానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు తాడిపత్రి. ధర్మవరం, రాప్తాడు. పుట్టపర్తి, అనంతపురం అర్బన్, రాయదుర్గం.. వంటి కీలకమైన నియోజక వర్గాల్లో వైసీపీ పట్టు భారీగా పెరిగింది. ఇటు అధికారులు కావొచ్చు.. అటు ప్రతిపక్ష నాయకులు కావొచ్చు.. అందరూ.. కూడా వైసీపీ దెబ్బతో హడలిపోతున్నారనేది వాస్తవం. క్షేత్రస్తాయిలో ప్రతిపక్ష నాయకులు ఒక కార్యక్రమం చేపట్టాలంటే.. ముందుకు రాలేని పరిస్థితి వచ్చేసింది.
కనీసం.. ఒక నిరసన తెలపాలన్నా.. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలకు తలకు మించిన పనిగా మారిపోయింది.అంతేకాదు.. కేడర్‌ను కాపాడుకోవడం.. మరింత కష్టంగా మారింది. కేడర్‌పై అధికార పార్టీ నేతలు పెడుతున్న కేసులు..
అధికారుల వ్యవహార శైలి వంటివి ఎన్నికలను తలపిస్తున్నాయి. మరి ఇప్పటి నుంచి కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే.. ఈ జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో అసలు టీడీపీ తరఫున జెండా మోసే నాయకులు కూడా ఉండడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.