ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైటింస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తాజాగా సంచలన విషయం చెప్పారు. భారత ప్రభుత్వం చేసిన పని వల్ల 91 దేశాల్లో కరోనా వైరస్ టీకాల కార్యక్రమానికి తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు. కరోనా వైరస్ టీకా 'కోవీషీల్డ్' టీకాలను సరఫరా చేస్తామని భారత్ కు చెందిన సీరమ్ సంస్థ కాంట్రాక్ట్ కుదుర్చుకుందట.. భారత్ లోని సీరంతో అత్యధికంగా ఆఫ్రికా దేశాలే ఒప్పందం కుదుర్చుకున్నాయట.. ఇప్పుడు ఆ దేశాలకు సరఫరా కాక వాళ్లంతా మొత్తుకుంటున్న పరిస్థితి నెలకొంది.
భారత్ లో ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ పెరిగిన పోయిన నేపథ్యంలో దేశంలో కరోనా టీకాల కొరత.. డిమాండ్ వల్ల టీకాల ఎగుమతిపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించినట్టు సౌమ్య చెప్పారు. కేంద్రం విధించిన నిషేధం వల్ల సీరం సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా దేశాలకు సరఫరా చేయలేకపోయిందని సౌమ్య మండిపడ్డారు.
టీకాలు అందక ఇప్పుడు కొత్త కంపెనీలతో టీకా ఒప్పందాలు చేసుకోలేక ఆఫ్రికా దేశాలు అవస్థలు పడుతున్నాయని భారత ప్రభుత్వం తీరుపై సౌమ్య మండిపడ్డారు. ఇప్పటికీ 91 దేశాల్లో కరోనా టీకా అందడం లేదని సౌమ్య తెలిపారు. చాలా దేశాల్లో 0.5 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ జరిగిందని వివరించారు.
చాలా దేశాల్లో ఆరోగ్య సిబ్బందికి కూడా టీకాలు వేయలేదని సౌమ్య చెప్పారు. కేంద్రప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలోనే కాదు.. ప్రపంచదేశాలు టీకాలకు ఇబ్బందులు పడుతున్నాయని సౌమ్య విమర్శలు గుప్పించారు.