రాజ‌ధానుల‌పై వైసీపీ దూకుడు.. బీజేపీని ఇరికించే వ్యూహమేనా..?

Update: 2022-08-06 15:30 GMT
రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు త‌థ్య‌మ‌ని భావిస్తున్న వైసీపీ అధిష్టానం.. ఆ దిశ‌గానే వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోని విష‌యం తెలి సిందే. అంతేకాదు.. ఒక రాజ‌ధాని ఉండాలో..రెండు రాజ‌ధానులు ఉండాలో కూడా కేంద్రం ఇత‌మిత్థంగా చెప్ప‌డం లేదు. ఇది ఒక‌ర‌కంగా.. ఎన్నిక‌ల ముంగిట వైసీపీకి ప్రాణ‌సంక‌టంగా మారిపోయింది. అయితే.. ఇప్పుడు ఈ విష‌యాన్ని గ్ర‌హించిన సీఎం జ‌గ‌న్‌.. దీనిపై ముందుకే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి కేంద్రం నుంచి క‌ద‌లిక వ‌చ్చేలా ఆయ‌న వ్యూహ ర‌చ‌న చేసినట్టు తెలిసింది. అయితే.. ఇప్పుడు దీనిని రాజ‌కీయ కోణంలో చూస్తున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా బీజేపీతో క‌లిసి పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనిని ఎదుర్కొనాలంటే.. వైసీపీకి చాలా వ్యూహం అవ‌స‌రం.

అయితే.. ఇప్పుడు దీనికి అడ్డుక‌ట్ట వేయాలంటే.. బీజేపీని అదుపులో పెట్టాలంటే.. మూడు రాజ‌ధానుల మంత్ర‌మే క‌రెక్ట్ అనేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మూడు రాజ‌ధానులతో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేందుకు.. అవ‌కాశం ఉంటుంద‌ని.. అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని.. వైసీపీ చెబుతోంది. ఇప్పుడు ఇదే విష‌యంపై.. పార్ల‌మెంటులో బిల్లు పెట్ట‌డం ద్వారా.. కేంద్రాన్ని ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ విష‌యంలో కేంద్రం క‌నుక .. ఎటూ తేల్చ‌క‌పోతే.. వైసీపీ త‌న‌కు అనుకూలంగా దీనిని తీసుకునే ఛాన్స్ క‌నిపిస్తోంది.

అంటే.. రాష్ట్రంలో బీజేపీ.. దూకుడును వైసీపీ మూడు రాజ‌ధానుల‌తో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. మేం మూడు రాజ‌ధానుల‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించాం. కానీ, కేంద్రంలోని బీజేపీ మాత్రం అడ్డుత‌గులుతోంది.

ఈ పార్టీకి ఓటేస్తే.. రాష్ట్రం ఎలా డెవ‌ల‌ప్ అవుతుంది..? అనే ప్ర‌శ్న‌ను తెర‌మీదికి తెచ్చే ప్ర‌య‌త్నం చేయ‌నుంది. అదేస‌మ‌యంలో క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని విష‌యంలోనూ బీజేపీ ఆడుతున్న నాట‌కాన్ని ఈబిల్లు రూపంలో బ‌య‌ట‌పెట్టే ఛాన్స్ వైసీపీకి క‌నిపిస్తోంది. ఏదేమైనా.. ఇది వ్యూహాత్మ‌క చ‌ర్య‌గానే భావిస్తున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News