ఉగ్రవాదులకు ఆమె భారీ టార్గెట్!

Update: 2016-12-20 10:03 GMT
అమాయకులను చంపడం, సామాన్యుల రక్తం కళ్లచూడటమే పనిగా పెట్టుకున్న నరరూప రాక్షసులే ఉగ్రవాదులు. అలాంటి ఉగ్రవాదులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది ఒక మహిళ. ప్రపంచ వ్యాప్తంగా సామాన్యులను చంపడంలో సిద్దహస్తులైన ఉగ్రవాదులు... ఆమెను చంపడానికి నానా పాట్లు పడటమే కాకుండా.. ఆమె తలపై భారీ నజరానా కూడా ప్రకటిస్తున్నారు. ఇంతకూ ఆ మహిళ ఎవరంటారా.. జోనా పలానీ.

అవును జోనా పలానీ ని చంపేసే వారికి తాము మిలియన్‌ డాలర్లు ఇస్తామంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది. చంపక పోయినా పర్లేదు కనీసం ఆమె జాడ అయినా తమకు తెలియజేయాలంటూ కోరుతున్నారు. యూనివర్సిటీ విద్యను వదిలేసిన జోనా పలానీ (23) అనే కుర్దీష్‌ మహిళ.. 2014లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నడుంకట్టింది. అలా నడుంభిగించిన తొలినాళ్లలోనే సిరియా, ఇరాక్‌ లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో పోరాటానికి దిగి పలువురిని హతం చేసి వార్తల్లోకెక్కింది. ఇది చూసి జీర్ణించుకోలేకపోతున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆమెను ఎలాగైనా హత్య చేయాలని కుట్రలు పన్నుతున్నారు.

ఆ సంగతులు అలా ఉంటే... జోనా పలాని ప్రస్తుతం కోపెన్‌ హాగన్‌ జైలులో ఉంది. రేపటి నుంచి విచారణ మొదలుకానుంది. 2015 జూన్‌ లో ఆమెపై ఎక్కడికి వెళ్లొద్దంటూ డెన్మార్క్‌ విధించిన నిషేధాన్ని అతిక్రమించిందని ఆమెను జైలులో పెట్టారు. నిజంగానే ఆమె నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే మాత్రం సుమారు రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. అయితే... ఈ జోనా పలానీకి ఉగ్రవాదులనుంచి బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు! కాగా, పాలిటిక్స్‌ లో డిగ్రీ చదువుతున్న జోనా పలానీ చదువు మధ్యలోనే మానేసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కుర్దీష్‌ సేనల్లో చేరింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News