భార‌త్ లో ఐసిస్ రాక్ష‌సుల మార‌ణ‌హోమం?

Update: 2017-11-16 06:12 GMT
గ‌డిచిన కొద్దిరోజులుగా భార‌త్ లో ఉగ్ర రాక్ష‌సుల మార‌ణ‌హోమం లేదు. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు చెక్ పెట్టె రీతిలో పాల‌కులు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు వ‌ర్క్ వుట్ అవుతున్నాయి. ఇలాంటి వేళ‌.. భారత్ లో మార‌ణ‌హోమాన్ని ఎలా చేప‌ట్టాల‌న్న అంశానికి సంబంధించిన సంచ‌ల‌న ఆడియో క్లిప్ ఒక‌టి ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

యూర‌ప్ లో ఏ రీతిలో అయితే భారీ వాహ‌నాల‌తో విరుచుకుప‌డ్డారో.. స‌రిగ్గా అదే ప్లాన్ ను భార‌త్ లోనూ అమ‌లు చేసి భారీ మార‌ణ‌హోమాన్ని సృష్టించాలంటూ చేస్తున్న ప్ర‌క‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

హిందువుల పండ‌గ‌ల్ని.. విశేష కార్య‌క్ర‌మాల్ని ల‌క్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున మార‌ణ‌హోమానికి ప్లాన్ చేయాలంటూ ఐఎస్ ఉగ్ర‌వాది అబ్దుల్ ర‌షీద్ మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిందువులు తినే ఫుడ్ లో విషం క‌ల‌పాల‌ని.. త్రిస్సూర్ పురం.. మ‌హా కుంభ‌మేళాలు జ‌రిగే ప్రాంతంలో భారీ వాహ‌నాల్ని జ‌నం మీద న‌డ‌పాల‌ని కోరాడు.

దాదాపు ప‌ది నిమిషాల నిడివి ఉన్న ఈ టేపు మ‌ల‌యాళంలో ఉంది. భార‌త్ కు చెందిన ర‌షీద్ ఇంజ‌నీరింగ్ అభ్య‌సించాడు. ఉగ్ర‌వాదం ప‌ట్ల ఆక‌ర్షితుడైన అత‌గాడు.. ఐఎస్ రాక్ష‌సుల‌తో చేతులు క‌లిపాడు.  భార‌త్ లో  ఎలాంటి  మార‌ణ‌హోమం సృష్టించాలో వివ‌రంగా చెప్పిన ర‌షీద్‌.. ఐఎస్ సానుభూతిప‌రుల్ని ఆక‌ర్షించేలా చేశాడ‌ని చెప్పాలి.

హిందువులు తినే ఆహారంలో విషం క‌ల‌పాల‌ని.. తాగే నీళ్ల‌లోనూ విషం క‌ల‌పాల‌న్నాడు. లక్ష‌లాది మంది హాజ‌ర‌య్యే త్రిస్సూర్ పుర‌మ్‌.. మ‌హాకుంభ‌మేళ లాంటివి జ‌రుగుతున్న‌ప్పుడు భారీ వాహ‌నాల్ని నిర్దాక్షిణ్యంగా జ‌నాలపై తొక్కించాల‌ని పిలుపునిచ్చాడు.

ఒక్కో ఉగ్ర‌వాది ఒంట‌రి తోడేళ్ల మాదిరి హిందువుల‌పై దాడికి పాల్ప‌డాల‌న్నారు.  ఈ సంద‌ర్భంగా లాస్ వేగాస్ మ్యూజిక్ క‌న్స‌ర్ట్‌.. లండ‌న్ వీధుల్లో సృష్టించిన మార‌ణ‌హోమాన్ని గుర్తు చేశారు. అదే రీతిలో భార‌త్ లోనూ ఉగ్ర‌కార్య‌క‌లాపాల్ని మ‌రింత పెచాల‌న్నాడు. "రైళ్ల ప‌ట్టాల్ని తొల‌గించండి.  లేదంటే క‌త్తిని ఉప‌యోగించండి.  వారిని చంప‌టానికి మీ తెలివితేట‌ల్ని ఉప‌యోగించండి. ప్ర‌జాస్వామ్యాన్ని.. హిందుయిజాన్ని నాశ‌నం చేయండి. అల్లా ఆదేశాల‌తో రాజ్య‌పాల‌న చేయండి. ఒక‌వేళ మీరు ఇలాంటి ప‌నులు చేయ‌లేక‌పోతే ఐసిస్‌కు ఆర్థిక సాయం చేయండి" అంటూ తాజా టేపులో పేర్కొన్నాడు. ఉలిక్కి ప‌డేలా చేయ‌ట‌మే కాదు.. వ‌ణుకు పుట్టిస్తున్న ర‌షీద్ టేపుపై కేసు న‌మోదు చేసిన కేర‌ళ పోలీసులు అత‌గాడి కోసం గాలింపు షురూ చేశారు.
Tags:    

Similar News