క్రీస్తుశకం 32లో నిర్మించిన ఆలయాన్ని పేల్చేశారు

Update: 2015-08-31 05:02 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు రెండు వేల ఏళ్ల కిందట నిర్మించిన ఒక పురాతన దేవాలయాన్ని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు పేల్చేశారు. మానవత్వం అన్నది లేకుండా.. పైశాచికత్వంతో రెచ్చిపోతూ.. మనుషుల్ని.. విలువైన చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మరోసారి తమ ఆరాచకకాండను అమలు చేశారు.

సిరియాలోని ప్రముఖ.. పురాతన బాల్ ఆలయంపై విరుచుకుపడ్డారు. సిరియన్ల ప్రముఖ దైవం బాల్ దేవాలయాల్ని ఒక్కొక్కటికి ధ్వంసం చేస్తున్న వారు.. ఆదివారం బాంబులతో పేల్చేశారు. క్రీస్తుశకం 32 లో నిర్మించిన ఈ ఆలయాన్ని బాంబులు పెట్టి పేల్చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.  ఈ పేల్చేసిన ఆలయానికి యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కూడా ఉంది.

ఈ దారుణ ఘటన సమయంలో భారీగా శబ్ధం చోటు చేసుకుందని.. ఈ బాంబుల శబ్దాన్ని నేరుగా విన్న వారికి వినికిడి లోపం తలెత్తేంత భారీ స్థాయిలో ఈ పేలుడు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆరాచకకాండను నిలువరించేవారెవరు అన్నది పెద్ద ప్రశ్న అని చెప్పక తప్పదు.
Tags:    

Similar News