పురాణాల్లో అరవీర భయంకరంగా వర్ణించే రాక్షసుల్లో సైతం కనిపించని దారుణమైన కోణం ఇస్లామిక్ తీవ్రవాదుల్లో కనిపించటం ఆందోళన కలిగిస్తుంది. ఈ భూమి మీద జీవించే అవకాశం ఎంతమాత్రం లేని వారు ఎవరైనా ఉంటే.. వారు ఐసిస్ తీవ్రవాదులేనని చెప్పక తప్పదు. ఈ సంస్థకు సంబంధించి ఇప్పటికే ఎన్నో దారుణ విషయాలు బయటకు వచ్చినా.. తాజాగా వచ్చిన అంశం ముందు మిగిలిన దారుణాలన్నీ చిన్నబోవటం ఖాయం.
తాము విపరీతంగా ద్వేషించే యాజిదీ మహిళల్ని దారుణంగా హింసించటం.. బతికి ఉన్నప్పుడే ప్రత్యక్ష నరకాన్ని చూపించే ఈ నరరూప రాక్షసులకు తల్లి.. చెల్లి.. అన్న తేడా కూడా ఏమీ ఉండవనే విషయాలు వింటే భీతి కలగటం ఖాయం. పెళ్లాల పట్ల మర్యాద ఉండదంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ రాక్షసులకు పెళ్లాం అన్నది కేవలం వినోద వస్తువు.. వారికి భౌతిక సుఖాన్నిఅందించే మానవ యంత్రమన్న విషయం తెలిసిందే. కానీ.. చరిత్రలో ఎప్పుడూ.. ఎక్కడా లేని విధంగా తల్లి.. చెల్లెళ్లను సైతం సెక్స్ సాధనాలుగా చూడటం ఈ దుర్మార్గులకు మాత్రమే సాధ్యమైంది. వారెంత దారుణమైన రాక్షసులన్న విషయాన్ని తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనంలో ఐసిస్ కు చెందిన ఒకరితో మాట్లాడటం జరిగింది. అతడు తన అనుభవాల్ని చెప్పటంతోపాటు.. ఐసిస్ మహిళల్ని ఎలా చూస్తుందన్న విషయాన్ని వెల్లడించటం ద్వారా ప్రపంచానికి కొత్త తరహా షాకిచ్చాడు. ఐసిస్ తీవ్రవాదులు మహిళల్నికిడ్నాప్ చేసి వారిని సెక్స్ బానిసలుగా చేయటాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మహిళ స్థానంలో మీ అమ్మ కానీ చెల్లి కానీ ఉంటే? వాళ్లను కూడా ఉగ్రవాదులు అత్యాచారం చేసి అమ్మేస్తే? మీ స్నేహితులు కొంతమంది వాల్లను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేస్తావు? అన్న సూటి ప్రశ్నలకు స్పందించిన సదరు రాక్షసుడు.. కిడ్నాప్ చేసుకొచ్చే మహిళల స్థానంలో తన తల్లి సహా ఎవరున్నా తాను పట్టించుకోనని.. ఎందుకంటే.. తాము చేసేదంతా జిహాద్ కోసమేనని.. అదే ఇక్కడి షరియత్ చట్టంగా పేర్కొన్నాడు. ఇక్కడ సామాజిక న్యాయ వ్యవస్థ అంటూ ఏమీ ఉండదని.. ఉన్నదంతా ఇస్లామిక్ స్టేట్ లా మాత్రమేనని.. దాని ప్రకారమే నడుచుకుంటామని వ్యాఖ్యానించాడు. మహిళలంతా దిగువ స్థాయి వారే అంటూ తెగబడ్డాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/