ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ కన్ను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద పడింది. గత కొద్దిరోజులుగా ఐసిస్ తీవ్రవాదుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. ముస్లిం యువకులు దాని ఉచ్చులో పడొద్దంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ మీద ఇస్లామిక్ స్టేట్ కన్నెర్ర చేసింది.
ఐసిస్ ట్విట్టర్ ఖాతాలో అసదుద్దీన్ ఓవైసీకి వార్నింగ్ ఇచ్చింది. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని ఈ హైదరాబాద్ ఎంపీకి హెచ్చరికలు చేసింది. ఐఎస్ ను భూతంగా చూపిస్తూ ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యలపై ఒకవేళ చర్చ నిర్వహిస్తే.. తాము అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేరంది. భారత్ లో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తామని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ నుంచి వచ్చిన ట్విట్టర్ వార్నింగ్ కు తాను బెదిరేది లేదంటూ అసదుద్దీన్ తేల్చి చెప్పారు.