ఇంతకంటే రాక్షసత్వం ఇంకేం ఉంటుంది?

Update: 2016-01-18 09:03 GMT
ప్రాణం పోయిన తర్వాత నరకానికి వెళతామని పురాణాల్లో చెబుతుంటారు. అలాంటి నరకం ఎలా ఉంటుందో తెలీదు కానీ.. బతికి ఉన్నప్పుడు నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఐఎస్ తీవ్రవాదులు. డిజిటల్ యుగంలో ఆది మానవుడి కంటే దారుణంగా వ్యవహరిస్తూ రాక్షసత్వానికి నిలువెత్తు రూపంగా కనిపించే ఐఎస్ తీవ్రవాదులు.. తాజాగా తమ ఆరాచకత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. స్వలింగ సంపర్కం చేస్తారన్న ఆరోపణ ఉన్న ఒక వ్యక్తికి విధించిన శిక్షను చూస్తే ఒళ్లు జలదరించక మానదు.

స్వలింగ సంపర్కం ఆరోపణలు ఉన్న వ్యక్తిని బంధించి.. చిత్రహింసలు పెట్టిన వారు చివరకు అంతిమశిక్ష విధించేందుకు సదరు వ్యక్తి ముఖానికి ముసుగు వేశారు. అందరూ చూస్తుండగా పెద్ద బిల్డింగ్ మీద నుంచి తాళ్లతో  కట్టేసిన అతగాడిని కిందకు పడేశారు. దీంతో..దబ్బున కిందపడి.. తల పగిలి మరణించాడు. ఈ దారుణ మరణశిక్షను అమలు చేసే సమయంలో ఫోటోలు.. వీడియోలు తీసి తమ క్రూరత్వాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించుకున్నారు. ఈ రాక్షసుల ఆరాచకానికి ముగింపు ఎప్పడు పడుతుందో..?
Tags:    

Similar News