రాక్షసులకు గూగుల్ సైట్ ఏదో కూడా తెలీదా?

Update: 2016-03-04 05:09 GMT
డిజిటల్ యుగంలో నరరూప రాక్షసులు ఎవరైనా ఉన్నారంటే.. మరో ఆలోచన లేకుండా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల్నిచూపించేయొచ్చు. మతోన్మాదంతో.. శాంతి అన్నది లేకుండా.. మనుషుల్ని అత్యంత దారుణంగా.. కిరాతకంగా హింసించి చంపటంలో వారికి వారే సాటి. హింసను అమితంగా ప్రేమించే వారికి మైండ్ మోకాలిలో ఉంటుందన్న విషయం తాజాగా నిరూపితమైంది. గన్నులతో తప్పించి.. బుర్రతో ఆలోచించే తత్వం తక్కువన్న విషయం తాజాగా వారి చేతల్ని చూస్తే ఇట్టే తెలుస్తుంది. ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ ను హ్యాక్ చేస్తానని బీరాలు పలికి.. ఆ సంస్థకు చెందిన వెబ్ సైట్ ను హ్యాక్ చేస్తున్నామని ప్రకటించి.. ఆ పేరుకు దగ్గరగా ఉన్న ఓ చిన్న కంపెనీ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి తప్పులో కాలేసింది.

గూగుల్ ను హ్యాక్ చేసి.. తమ నినాదాలతో హోరెత్తించాలన్న దుర్మార్గపు ఆలోచన చేసిన ఇస్లామిక్ స్టేట్.. ‘‘యాడ్ గూగుల్’’ అన్న పేరుతో ఉన్న వెబ్ సైట్ ను గూగుల్ కు చెందినదిగా ఐసిస్ తీవ్రవాదులు భావించారు. అయితే..ఈ సైట్ భారత్ కు చెందిన గాంధాని అనే వ్యక్దిది. ఐటీ సేవలు అందించే ఓ చిన్న కంపెనీది. అయితే.. ఈ సైట్ ను గూగుల్ కు సంబంధించిందని భావించిన ఐసిస్.. సైట్ ను హ్యాక్ చేసి.. ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించినఫ్రెంచ్ పాటను.. సంస్థ లోగోను కనిపించేలా చేసింది. తాము గూగుల్ ను హ్యాక్ చేసినట్లుప్రకటించిన ఐసిస్.. తన తప్పును తెలుసుకునే లోపే.. మరో హ్యాకింగ్ గ్రూప్.. ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి.. ఐఎస్ రాక్షసులు ఉంచిన మెసేజ్ ను చెరిపేసింది. గూగుల్ అన్న పేరు కనిపించిన సైట్లు అన్నీ గూగుల్ వి అయిపోతాయా..?
Tags:    

Similar News