కొన్ని మతాల ప్రచారానికి భారత్ అడ్డా. మత ప్రచార కార్యక్రమాల కోసం నిత్యం విదేశాలకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థల మాటున మత ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇలాంటివాటికి నిధులు, ఆలోచనలు, మానవ వనరులు అన్నీ విదేశాల నుంచి వస్తుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటివారి కారణంగా దేశంలో.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రబలే ముప్పు కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా కరీంనగర్‌లో వెలుగుచూసిన పాజిటివ్ కేసులన్నీ ఇండోనేసియా వాసులు కావడం.. వారంతా మత ప్రచార కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం తెలిసిందే.
వారు కరీంనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిరిగారు.. ఏఏ ప్రార్థనా స్థలాలకు వెళ్లారు.. ఎక్కడెక్కడ మత కార్యక్రమాల్లో పాల్గొన్నారు వంటివన్నీ తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు.
ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందంకుండా కట్టుదిట్టమైన చర్యలే చేపట్టింది. కానీ, ఇండోనేసియా నుంచి మతప్రచారానికి వచ్చినవారితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో పెద్దఎత్తున ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఏర్పడింది.
మరోవైపు ఏపీలోనూ ఓ మత ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇందు కోసం విదేశాల నుంచి వస్తున్నవారు... మత కార్యక్రమాల కోసం విదేశాలకు వెళ్లి వస్తున్నవారు ఎక్కువవుతున్నారు. ఇటీవలే గుంటూరు జిల్లాలో ఓ మతానికి సంబంధించిన భారీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దానికి లక్షలాది మంది వచ్చారు. విదేశీ ప్రతినిధులూ వచ్చారు. వారంతా ఇప్పుడెక్కడున్నారు..వారిలో ఎవరికైనా కరోనావైరస్ ఉందా.. వంటి అనుమానాలున్నాయి.