నరరూప రాక్షసుల్లాంటి ఐఎస్ తీవ్రవాదులు తాజాగా తీవ్రస్థాయిలో ఒక వార్నింగ్ ఇచ్చారు. గత వారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో సీరియల్ బాంబు పేలుళ్లతో రాజధాని నగరాన్ని అతలాకుతలం చేసిన వారు.. తాజాగా బెల్జియంలోని కొన్ని మీడియా సంస్థలకు వీడియోలను పంపారు. సిరియా.. ఇరాక్ లలో మిత్రపక్షాలకు చెందిన సైనిక విమానాలను.. సైనికులను ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో మరిన్ని దాడులు జరగటం ఖాయమంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. గత వారం చోటు చేసుకున్న బాంబుపేలుళ్లు అన్నీ శాంపిల్ మాత్రమేనని.. రానున్న రోజుల్లో మరింత భయానకమైన దాడులు చేస్తారని హెచ్చరించింది.
తమకు చాలా లక్ష్యాలు ఉన్నాయని.. మిత్రపక్షాలకు చెందిన సైనిక దళాల్ని తక్షణం ఉపసంహరించుకోకుంటే మాత్రం ఆయా దేశాల ప్రజలు ప్రశాంతంగా ఉండలేరని.. పీడకలను చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాక్.. సిరియాలలో ఉన్న సైనిక బలగాల్ని ఉపసంహరించుకోకుంటే మాత్రం తాము చేసే దాడుల్ని మరిన్ని చూడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. తాము ముందే చెప్పినట్లు ప్యారిస్.. బ్రసెల్స్ లో దాడులు చేశామని.. మిత్రపక్ష సేనలు వెళ్లకపోతే.. మరిన్ని పీడకలలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజా వార్నింగ్ చూస్తుంటే.. రాక్షసులు చేసిన దాడులన్నీ కూడా ప్రతీకారంతో కంటే.. ఉనికి కోసమేనన్న విషయం అర్థం కాక మానదు. మరి.. తాజా వార్నింగ్ పట్ల మిత్రదేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.