హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్ సీక్యూ) మాత్రల ఎగుమతిపై నిషేధం సడలించడంపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని వివిధ దేశాల అధినేతలు - అంతర్జాతీయ సంస్థలు కొనియాడుతున్నారు. మానవతా దృక్పథంతో ఆ మందు ఎగుమతులు చేసేందుకు అంగీకరించింది. అందులో భాగంగా అమెరికాతో పాటు బ్రెజిల్ - ఇజ్రాయిల్ దేశాలు భారతదేశాన్ని కీర్తిస్తున్నాయి. ఆ మందును ఎగుమతి చేసేందుకు నిబంధనలు సడలించి మందు ఎగుమతులు చేస్తుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ - బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ఇప్పటికే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పడంతోపాటు ప్రశంసించారు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వైరస్‌పై కట్టడి చేసేందుకు మలేరియా యాంటీ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకం సత్ఫలితాలను ఇస్తుండడంతో ఆ మందు కోసం ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. భారత్‌లో ఆ మందు నిల్వలు సరిపడా ఉండడంతో అమెరికా సహా ఇతర దేశాలు భారతదేశాన్ని సహాయం కోరాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత దృక్పథంతో అత్యవసర మందులపై విధించిన నిషేధాన్ని భారత్ ఎత్తివేసింది. అమెరికాకు మాత్రలు సరఫరా చేయగా ఇజ్రాయెల్ - బ్రెజిల్ కు కూడా సహాయం చేస్తున్నాం.
29 మిలియన్ల డోసుల డ్రగ్స్ భారత్ నుంచి పొందడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో కూడా కృతజ్ఞతలు తెలపగా తాజాగా సహాయం పొందిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా భారత సహాయాన్ని పొందడంతో ఆయన ప్రశంసలు కురిపించారు. దాదాపు ఐదు టన్నుల మెడిసన్ ఇజ్రాయెల్ కు ఎగుమతి చేయడంతో ఆ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
‘‘ ఇజ్రాయెల్ కు క్లోరోక్విన్ పంపినందుకు నా స్నేహితుడు - భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఇజ్రాయెల్ పౌరులందరూ మీకు ధన్యవాదాలు చెబుతున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను చూసిన ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్ కు ఎప్పుడు సహకరిస్తామని.. ఆ దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ లో బదులిస్తూ తెలిపారు. మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడుతామని చెప్పారు. స్నేహితులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని ప్రకటించారు.
ఇజ్రాయెల్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పది వేల మంది కరోనాతో బాధపడుతుండగా.. ఆ వైరస్ బారిన పడిన వారు 86 మంది మృతిచెందారు. ఇలాంటి పరిస్థితులు ఉండడంతో మార్చి 13వ తేదీన మాస్క్ ల కోసం - ఏప్రిల్ 3వ తేదీన క్లోరోక్విన్ డ్రగ్స్ ఎగుమతి చేయాలని కోరడంతో ఆ మేరకు భారతదేశం సహాయం అందించింది.