వీర్రాజుకు సొంత పెత్త‌న‌మే షాక్ ఇచ్చిందా...!

Update: 2022-10-24 08:12 GMT
రాష్ట్ర బీజేపీ సార‌థి.. సోము వీర్రాజుకు.. వ‌ర్రీ ప‌ట్టుకుంది. మ‌రో రెండు మూడు నెల‌ల్లోనే ఆయ‌న‌కు ప‌ద‌వీ గండం పొంచి ఉంద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త లేకున్నా.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న కీల‌క నాయ‌కుడు ఒక‌రు త‌న అనుచ‌రుల వ‌ద్ద ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. ఆశించిన విధంగా.. ఏపీ స‌ర్కారుపై సోము ఉద్య‌మం చేయ‌డం లేద‌ని.. దీంతో బీజేపీకి మైలేజీ రావ‌డం లేద‌ని.. కొంద‌రు నాయ‌కులు సోముపై కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు ఇప్ప‌టికే ఫిర్యాదులు చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనిని ఢిల్లీ వ‌ర్గాలు కూడా.. సీరియ‌స్‌గా తీసుకున్నాయ‌ని చెబుతున్నారు.

''మేం లేవ‌నెత్తిన అంశాల‌నే.. టీడీపీ వంటి ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తుతున్నాయి. మేం చాలా ముందుగానే ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గడు తున్నాం. అయితే.. అవి ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేదు. పైగా.. పార్టీనాయ‌క‌త్వంకూడా.. వాటిపై దృష్టి పెట్టి ప్ర‌భుత్వంపై పూర్తిస్థాయిలో యుద్ధం చేసేందుకు ముందుకు రావ‌డం లేదు.

దీంతో మేం చేస్తున్న కృషి ఫ‌లించ‌డం లేదు. ఇక‌, మార్పు త‌ప్ప‌దు''అని అనంత‌పురం జిల్లాకు చెందిన బీజేపీ కీల‌క నాయ‌కుడు ఒకరు వ్యాఖ్యానించారు. పైగా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో సోము స‌క్సెస్ కాలేక పోతున్నార‌ని చెబుతున్నారు.

ఇవి ఇలా ఉంటే.. పార్టీలోనూ. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో సోము మ‌రింత ప‌ల‌చ‌న అవుతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ''ఎవ‌రితోనూ ఆయ‌నకు స‌ఖ్య‌త లేదు. ఒక‌ప్పుడు విశాఖ‌లో కీల‌క నాయ‌కుడు గ‌ళం వినిపించేవారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టేవారు. కానీ, త‌ర్వాత‌.. ఆయ‌నను ఎవ‌రో కంట్రోల్ చేశారు. ఆయ‌న మాట్లాడ‌డు.. మ‌మ్మ‌ల్ని మాట్లాడ‌నివ్వ‌డు.. అన్న‌ట్టుగా.. ప‌రిస్థితి మారిపోయింది.

ఇలా అయితే.. పార్టీ పుట్టిమునిగిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే.. ప్ర‌జ‌ల్లో ఉన్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను మ‌నకుఅనుగుణంగా మార్చుకుందామ‌నే ధ్యాస లేక పోతే.. ఎలా?''అని మ‌రికొంద‌రు సోముపై విరుచుకుప‌డుతున్నారు.

మ‌రోవైపు.. తాను అనుకున్న‌దే అజెండా అన్న‌ట్టుగా.. సోము ముందుకు సాగుతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. అంత‌ర్వేది ర‌థం  ఘ‌ట‌న విష‌యంలో చేప‌ట్టిన ఆందోళ‌నకు జ‌న‌సేన‌ను కూడా ఆహ్వానించాల‌ని.. పార్టీ నాయ‌కులు సూచించారు. అయితే.. ఆ క్రెడిట్ ఎక్క‌డ జ‌న‌సేన ఖాతాలో ప‌డుతుందోన‌ని అనుకున్న సోము ఎవ‌రినీ ఆహ్వానించ‌లేదు. తీరా ఆ కార్య‌క్ర‌మం బెడిసి కొట్టింది. ఇలా.. సోము చేస్తున్న సొంత పెత్త‌నం కార‌ణంగానే పార్టీ బ‌ల‌హీన‌ప‌డింద‌నే వాద‌న‌.. ఆయ‌న‌ను మారుస్తార‌నేచ‌ర్చ‌జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News