ఈ రోజు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేసింది. మంగళవారం నాడు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో జరిగిన దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో ట్రంప్ తో పాటు ఇవాంకా - నిక్కీ హేలీ - సీమా వర్మ - అజిత్ పాయ్ - భారతీయ అమెరికన్ ఉద్యోగులు పాల్గొన్నారు. తన తండ్రితో పాటు ఆమె దీపావళి వేడుకలను జరుపుకున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. `ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు - సిక్కులు - జైనులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ అందరికీ సాల్ ముబారక్. భారత్ రావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను` అని ఆమె ట్వీట్ చేసింది. వచ్చే నెల హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఆమె హాజరుకానున్న సంగతి తెలిసిందే.
వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో దీపావళి వేడుకలను ట్రంప్....మంగళవారం ప్రారంభించారు. ఈ వేడుకల్లో వైట్ హౌస్ అధికారులు - ఇవాంకా - ట్రంప్ కుటుంబ సభ్యులు - భారత సంతతి అమెరికన్లు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సరదాగా ట్రంప్ టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా భారతీయ అమెరికన్లను ప్రశంసల్లో ముంచెత్తారు. అమెరికాకు శాస్త్రసాంకేతిక - వ్యాపార - విద్యా రంగాల్లో భారతీయుల సేవలు చిరస్మరణీయన్నారు. ప్రత్యేకించి తమ సైన్యంలో పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్ సైనికులు అద్భుతంగా పని చేస్తారని కితాబిచ్చారు. ప్రపంచంలో సువిశాల ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించిన భారత ప్రజలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నేడు ఈ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. అమెరికన్ కుటుంబంలో భారతీయులు కూడా సభ్యులేనని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుతున్న తొలి దీపావళి వేడుకలు ఇవే.
గత దీపావళి వేడులకలను ఇవాంకా వర్జినియా - ఫ్లోరిడాలలో ఉన్న హిందూ దేవాలయాలలో జరుపుకుంది. రెండు రోజులలో హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఆమె హాజరు కానుంది. ఆమె ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన టీమ్ ఈ సదస్సులో పాల్గొననుంది. అమెరికా - భారత్ లు సంయుక్త నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న ఈ సదస్సు నవంబరు 28 న ప్రారంభం కానుంది. ప్రారంభ సదస్సులో ఇవాంకా - మోదీ లు ప్రసంగించనున్నారు. అయితే, ఇవాంకా దీపావళి విషెస్ చెప్పి కమింగ్ హైదరాబాద్ అంటూ...ట్వీట్ చేసింది. సాధారణంగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఇవాంకా ట్వీట్ కు బదులివ్వలేదు.