ఏసీ గదుల్లో ఉంటూ.. చుట్టూ సెక్యురిటీ పెట్టుకొని బడాయి మాటలు చెప్పే నేతలకు ఈ దేశంలో కొదవలేదు. రక్షణ కల్పించే భారత భద్రతా సిబ్బందిని వెంట పెట్టుకొని ప్రాణాల్ని కాపాడుకునే కశ్మీరీ నేతలు పలువురు పాక్ తీరును తీవ్రంగా ఖండించే విషయంలోనూ ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కొందరు హురియత్ నేతలైతే మరింత దారుణంగా వ్యవహరిస్తూ.. భారత్ పై విమర్శలు చేస్తుంటారు.
ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశ పౌరులు చెల్లించే డబ్బులతో భద్రత నడుమ బతుకుతూ దేశం మీదనే వ్యతిరేక వ్యాఖ్యలు చేసే పాపిష్టి నేతలకు కశ్మీర్ లో కొదవ లేదు. ఇలాంటి నేతలతో పాటు.. కశ్మీర్ లోని పలువురు రాజకీయ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా జమ్ముకశ్మీర్ గవర్నర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ పలువురు నేతలకు భద్రతను ఉపసంహరిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నాయకులకు భద్రత అవసరం లేదని సెక్యురిటీ తొలగిస్తూ హోం శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. మొన్నటి వరకూ ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైజల్‌కు ఉన్న సెక్యురిటీని సైతం హోంశాఖ అధికారులు తొలగించారు.
గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో వెయ్యి మందికి పైగా పోలీసులు.. వంద వాహనాలు పోలీసు శాఖకు తిరిగి వచ్చాయి. వీటితో పోలీసు పహరాకు వినియోగించాలని నిర్ణయించారు. పాక్ కు చెందిన ఐఎస్ ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్న కశ్మీర్ నేతలపై చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసిన వేళ.. ప్రత్యేక వాదులపై చర్యలకు సిద్ధమవుతున్న వేళ.. భద్రతను ఉపసంహరించుకోవటం సంచలనంగా మారింది.
రాజకీయ నేతలతో పాటు..18 మంది హురియత్ నేతలకు సైతం భద్రతను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హురియత్ నేతలు పలువురు ప్రత్యేక కశ్మీర్ ను కోరుకుంటున్న విషయం తెలిసిందే.హురియత్ నేతల్లో ప్రముఖులుగా చెలామణీ అవుతున్న వారిలో అబ్దుల్ ఘనీషా.. యాసీన్ మాలిక్.. మహ్మద్ ముసాదిఖ్ భట్ లతో పాటు గిలానీకి కల్పించిన భద్రతను తొలగించారు.