అమిత్ షాతో జగన్ 95 నిమిషాల భేటీ.. ప్రెస్ నోటే పేపర్లలో వచ్చిందట

Update: 2021-06-11 07:30 GMT
అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ముఖ్యమైన ఘట్టం ముగిసింది. అమిత్ షాతో 95 నిమిషాల పాటు వరి సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల మీద ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను.. పెండింగ్ ఇష్యూలు వారి మధ్య చర్చకు వచ్చాయి. అభివృద్ధి పనులకు సహకరించాలని.. అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు.

అమిత్ తో జరిగిన సమావేశంలో ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్న విషయాలకు సంబంధించి ఈ రోజున అన్ని వార్తాపత్రికల్లో వార్తలు కవర్ అయ్యాయి. అన్నింటిలోనూ ఒకే తరహా అంశాలు ఉన్నాయి. అమిత్ షాతో భేటీ అనంతరం.. తాను చర్చించిన అంశాలకు సంబంధించిన వివరాల్ని జగన్ వెల్లడించటం.. అందుకుతగ్గ ప్రెస్ నోట్ ను అన్ని మీడియా సంస్థలకు సర్య్కులేట్ చేశారు.

అందులోని అంశాల్నే అన్ని మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. అమిత్ షాతో చర్చకు వచ్చినట్లుగా చెబుతున్న అంశాల్ని చూస్తే..

-  ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి 2020 ఆగస్టులో చట్టాన్ని తీసుకొచ్చామని.. కర్నూలులో హైకోర్టు స్థాపనకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. 2019లోజరిగిన ఎన్నికల సందర్భంగా బీజేపీమేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న అంశాన్ని బీజేపీ పొందుపర్చిన విషయాన్ని గుర్తు చేశారు.

-  విభజన తర్వాత ఏర్పడిన సమస్యల పరిష్కారానికి హోదానే. అలా చేస్తే రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అధికంగా వస్తాయి. అప్పుడు ఆర్థిక భారం తగ్గుతుంది. భారీ పరిశ్రమలు రావాలన్నా.. ఉద్యోగాల కల్పన జరగాలన్నాప్రత్యేక హోదా చాలా అవసరం. ఈ విషయాన్ని పరిశీలించాలని మరోమారు విన్నవించుకుంటున్నాం.

-   విభజన తర్వాత ఏపీలో మహానగరాలు లేవు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 వైద్య కళాశాలల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నాం. కేంద్రం ఇప్పటికే మూడు కాలేజీలకు అనుమతి ఇచ్చింది. మిగిలిన కాలేజీలకు అనుమతులు ఇవ్వాలి. మెడికల్ కాలేజీలతో పాటు నర్సింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి.. తగిన ఆర్థిక సాయం అందించాలి.

- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున కుడిగి.. వల్లూరుథర్మల్ ప్లాంట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. దాన్ని సరెండర్ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. 300 మెగావాట్లకరెంటు కొనుగోలుపై ఏటా రూ.325 కోట్ల ఫిక్సెడ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది.

- విభజన తర్వాత తెలంగాణ డిస్కంల నుంచి రూ.5541.7 కోట్ల బకాయిలు రావాల్సి వచ్చింది. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా వాటికి తగిన రుణ సదుపాయాలను కల్పించి.. ఏపీ జెన్ కోకు కేంద్ర పన్నుల వాటా నుంచి డబ్బులు అందేలా చూడాలి. రాష్ట్ర విద్యుత్ రంగం దాదాపు రూ.50వేల కోట్ల అప్పుట్లో ఉంది. ఆ రుణాల్నిరీస్ట్రక్చర్ చేయాలి.

-  గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రూ.4652 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఆ డబ్బుల్ని వెంటనే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పించాలి. బియ్యం పంపిణీ కింద రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం నుంచి రూ.3229 కోట్లు రావాల్సి ఉన్నాయి. ఆ బకాయిల్ని వెంటనే ఇప్పించగలరు.

- విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్రం గుర్తించింది. వెంటనే వర్సిటీ ఏర్పాటు చేయాలి.
Tags:    

Similar News