ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి - మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కోర్టుకు హాజరయ్యారు. రెండు గంటల పాటు సీఎం జగన్ కోర్టులోనే ఉండనున్నారు. సీఎం హోదాలో తొలి సారిగా జగన్ సీబీఐ కోర్టుకు వచ్చారు. గత ఏడాది మార్చి 1న చివరిసారిగా ఆయన న్యాయస్థానంలో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చాయి.
అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు గత వారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఆయన - రెండో నిందితుడైన వైసీపీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పని సరిగా హాజరుకావాలని - లేదంటే తగు ఉత్తర్వులు జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ - విజయసాయి రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జగన్ కోర్టుకు రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం - తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో సీబీఐ కోర్టు వద్ద తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇకపోతే ఈ క్రమంలో తన తరపున సహ నిందితుడు హాజరు అవుతారని - వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయవాది కోరారు. గతంలోనూ జగన్ ఇదే విధంగా కోరగా... ఆ అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. ఇప్పుడు తన తరపున న్యాయవాది హాజరతారని కోరిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.జగన్ తరపు వాదనలను లాయర్ నిరంజన్ రెడ్డి.. మరోవైపు సీబీఐ తరపున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇలా ఇరు వాదనలు విన్న అనతరం తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17 కు వాయిదా వేసింది.