భావోద్వేగ ఘటనలు అరుదుగా వస్తుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఒడిసిపట్టుకొని వాటితో వీలైనంత లబ్థి పొందటం కామన్. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఏపీ విఫక్ష నేత జగన్ వైఖరి ఆశ్చర్యకరంగా మారిందని చెప్పాలి. ఇవాళ జగన్ తల్లి విజయమ్మ 60 పుట్టిన రోజు. ఈ సందర్భంగా తల్లి పక్కన కూర్చొని.. కేక్ కట్ చేయించి.. ఆమెకు కేక్ ను తినిపించి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఓపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తున్న వేళ.. జగన్ పార్టీ నేతలు చెల్లాచెదురు కావటం తెలిసిందే. ఇలాంటి సమయంలో పార్టీ నేతలందరిని కలిపే అవకాశం విజయమ్మ జన్మదినోత్సవ రూపంలో ఉన్నప్పటికి అందుకు భిన్నంగా జగన్ వ్యవహరించటం విశేషం. తల్లి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినా.. పార్టీ నేతలు కానీ రాకుంటే మొదటికే మోసం వస్తుందని ఫీలయ్యారో ఏమో కానీ.. సింఫుల్ గా లాగించేయటం గమనార్హం.
జగన్ పార్టీలోని నేతలకు జగన్ తో ఉన్న అనుబంధానికి.. వైఎస్ సతీమణి హోదాలో విజయమ్మతో ఉన్న అనుబంధానికి వ్యత్యాసం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఇలాంటివేమీ పట్టించుకోని జగన్.. తల్లి 60వ పుట్టిన రోజును సింఫుల్ గా పూర్తి చేయటం చూస్తే.. పార్టీ నేతల విషయంలో జగన్ సందేహాలు ఎక్కువగా ఉన్నాయా? అన్న అనుమానం రాక మానదు.