దూకుడు విమర్శలు చేసే ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తనతో పాటు అధికార తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేశారు. ఇదంతా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగత టార్గెట్ చేయడం వల్ల జరిగిన పరిణామం. అసెంబ్లీ వేదికగా ఆక్వాఫుడ్ పార్క్ విషయంలో అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో జగన్ విద్యార్హతలు, ఆయన అనుభవం వంటి వాటి గురించి అచ్చెన్నాయుడు కామెంట్లు చేశారు.
ఈ క్రమంలో జగన్ స్పందిస్తూ తాను ఫ్యాక్టరీ గురించి, ప్రజల జీవితాల గురించి మాట్లాడితే మంత్రి మాత్రం తన విద్యార్హతలు, అనుభవం గురించి సంబంధం లేని విషయాలు మాట్లాడారని అన్నారు. తన రాజకీయ జీవితం గురించే చర్చ అయితే....తాను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 5.45 లక్షల మెజారిటీ వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగానే టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదని ఎద్దేవా చేశారు. `మీ జీవితంలో ఎప్పుడూ అంత మెజారిటీ చూడలేదు` అని మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తనతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఓ వ్యక్తి మాట్లాడారని అంటూ లేనిపోని ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడికి వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు. తన చదువు గురించి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని వైఎస్ జగన్ సవాలు చేశారు. ఇది తనకు, చంద్రబాబుకు సవాలని జగన్ స్పష్టం చేశారు. అలాగే తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినందున తన స్థాయి ఎక్కువంటూ అచ్చెన్నాయుడు చెప్పిన అంశాలకు కూడా గట్టిగా జవాబు చెప్పారు. చట్టసభలు తనకు కొత్త కాదని, సభా సంప్రదాయాలు తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. ఎవరి స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/