ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మరింత సంతోషానికి గురయ్యే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ సాధించింది. పారిస్ లోని క్యాంపస్ లో ఆమె తన మాస్టర్స్ డిగ్రీని చేయనున్నారు. రాజకీయంగా సుపరిచితమైన జగన్.. ఆయన వ్యక్తిగత విషయాలు.. కుటుంబ సభ్యుల వివరాలు పెద్దగా బయటకు రావు.
ఇప్పటికే విదేశాల్లో చదివిన జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె.. తాజాగా ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ లో సీటును సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె పారిస్ కు వెళ్లనున్నారు. హర్ష రెడ్డికి సెండాఫ్ ఇచ్చేందుకు జగన్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా బెంగళూరుకు వెళ్లి.. ఆమెకు వీడ్కోలు పలకనున్నారు.
ఇప్పటికే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్ష రెడ్డి స్వదేశానికి వచ్చారు. హర్షకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు అభినందనలు తెలిపారు. ఏమైనా.. తెలుగు గడ్డ మీద రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో ప్రఖ్యాత కళాశాలలో మాస్టర్స్ చేసిన అతి కొద్దిమందిలో హర్ష రెడ్డి ఒకరుగా చెప్పక తప్పదు.