కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాతో భేటీ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం వేళకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విమానాశ్రయం నుంచి తన అధికారిక నివాసానికి వెళ్లిన ఆయన అక్కడ రోజుంతా బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పలువురు అధికారులు ఆయన్ను కలుసుకునేందుకు వచ్చారు.
వారితో వరుస భేటీలు నిర్వహించిన జగన్.. క్షణం తీరిక లేకుండా గడిపేశారు. అదికారులతో పాటు.. పార్టీకి చెందిన ఎంపీలు పలువురు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు.. పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి.. లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. ఎంపీలు బాలశౌరి.. ప్రభాకర్ రెడ్డి.. రఘురామకృష్ణంరాజు.. వైఎస్ అవినాశ్ రెడ్డి.. లావు శ్రీకృష్ణదేవరాయలు.. మార్గాని భరత్ తో పాటు.. ఇతర నేతలు జగన్ తో భేటీ అయ్యారు.
ఇలా వరుస భేటీలతో రాత్రి వరకూ సాగాయి. ఈ రోజు కీలక సమావేశాలు ఉండనున్నాయి. కేంద్ర న్యాయ.. ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో మధ్యాహ్నం 12.30 గంటల వేళలో కలవనున్నారు. దీనికి ముందుగా కానీ.. లేదంటే రెండు గంటల ఆలస్యంగా కానీ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం జగన్ తిరుగు ప్రయాణం ఉంటుందంటున్నారు. అనుకోని పనులు ఎదురైతే మాత్రం ఆయన మరో రోజు ఢిల్లీలో ఉండే అవకాశం ఉందంటున్నారు.