ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారు పవన్ సార్ ?

ఇక చూస్తే పవన్ పిఠాపురంలో ఆవేశంతో ఈ మాటలు అన్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. అదే ఆవేశంలో ఆయన హోం మంత్రిని డైరెక్ట్ గానే టార్గెట్ చేశారు అని అంటున్నారు.

Update: 2024-11-06 12:45 GMT

జనసేనానిగా ఆయనకు పేరు. ఆయన వెండి తెర మీద పవర్ స్టార్. రాజకీయాల్లో పవర్ ఫుల్ స్టార్. ఆయన కూటమిని కట్టించి ఉప ముఖ్యమంత్రి అయిన చాణక్య రాజకీయం తన సొంతం అని నిరూపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు జనసేనకు సముచితమైన స్థానాన్నే టీడీపీ ఇచ్చి గౌరవిస్తోంది.

అటువంటిది పవన్ సడెన్ గా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తూ తమ సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు, బయటకు వస్తే జనాలు మమ్మల్ని తిడుతున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇంతకీ పవన్ ని ఎందుకు జనాలు తిడుతున్నారు, ఏ విషయం మీద అన్న చర్చ కూడా బయల్దేరింది.

ఇక చూస్తే పవన్ పిఠాపురంలో ఆవేశంతో ఈ మాటలు అన్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. అదే ఆవేశంలో ఆయన హోం మంత్రిని డైరెక్ట్ గానే టార్గెట్ చేశారు అని అంటున్నారు. అయితే అనిత ఏమి చేశారని పవన్ ఆమెను టార్గెట్ చేశారు అన్నది కూడా అంతా అనుకుంటున్న మాట.

పవన్ కామెంట్స్ తో టీడీపీ కూటమిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పవన్ ఉన్నట్టుండి ఎందుకు హోం మంత్రిని టార్గెట్ చేశారు అన్నది అయితే ఎవరికీ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. ఇక పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిల్లల మీద మహిళల మీద అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయని కూడా కామెంట్స్ చేశారు.

సరే పవన్ ఆవేదనతో ఈ మాటలు అన్నా ఆయన బాధ్యత కలిగిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు. అంతే కాదు ఈ దేశంలో చట్టాలు, న్యాయాలు కచ్చితంగా పనిచేస్తాయి, అయితే కొంత టైం కూడా ఇవ్వాలి కదా అని అంటున్నారు.

పవన్ ఆవేశంతో ఒక బడుగు వర్గానికి చెందిన మహిళా మంత్రిని అంటే ఎలా అని కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఆమె ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. అలాంటి ఆమె పోస్టుని తీసుకుంటామని అనడం పట్ల కూడా చర్చ సాగుతోంది అంటున్నారు.

నిజానికి పవన్ కి లా అండ్ ఆర్డర్ ఏపీలో సాఫీగా సాగడం లేదు అన్న భావన ఉంటే మంత్రి వర్గ సమావేశంలో చెప్పవచ్చు కదా అని అంటున్నారు. అంతే కాదు నేరుగా సీఎం వద్దకు వెళ్ళి కూడా చర్చించవచ్చు అని అంటున్నారు. అయితే పవన్ టార్గెట్ అనిత కాకపోవచ్చు అన్నది మరో మాటగా ఉంది.

ఆయన మనసులో లోపల ఏదో ఉందని కానీ బయటకు వచ్చింది వేరు అని కూడా విశ్లేషిస్తున్న వారూ ఉన్నారు. కూటమి లోపల ఏదో జరుగుతోంది అని అనుమానిస్తున్న వారూ ఉన్నారు. అయితే ఆవేశంతో వ్యాఖ్యలు చేసి గమ్మున ఉంటే మాత్రం కూటమిలో సయోధ్య దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు.

ఈ విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ భారీ విజయం కానీ ఆయన పార్టీ 21 సీట్లకు 21 గెలుపు కానీ జనసేన బలంతో దక్కినవా అని నేరుగా ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. టీడీపీ మద్దతు లేకపోతే పవన్ కి జనసేనకు ఈ విజయాలు లభించేవా అని కూడా అంటున్నారు.

ఇక హోం మంత్రి పదవి అన్నది కత్తి మీద సాము లాంటిది. ఆ పదవిలో ఎవరు ఉన్నా ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీతో పాటు మారిన కల్చర్, ఇతర అనేక అనర్థాల మూలంగా క్రైమ్ రేటు కొత్త పుంతలు తొక్కుతోంది. అది పవన్ హోం మంత్రి అయినా కూడా తగ్గుతుందా అన్నది చాలా మంది వేసే ప్రశ్నగా ఉంది. పవన్ హోం మంత్రి అయినా ఏపీ మొత్తం అయిదు కోట్ల మంది ప్రజలకు కాపలా ఉండగలరా అని కూడా కామెంట్స్ చేస్తున్న వారూ ఉన్నారు.

ఇక రేపులు చేసే వాళ్ళను కృత్రిమ మేధ సాయంతో ఏమైనా పవన్ కనిపెట్టగలరా అని కూడా అంటున్న వారూ ఉన్నారు. తప్పుకు కఠినమైన శిక్షలు ఉండాలి. అవి వేగవంతంగా అమలు అయ్యేలా చూడాలి. నేరాలు తగ్గుముఖం పట్టడానికి అవే సరైన పరిష్కారం అని అంటున్నారు. రేపులు చేసే వారి మీద కఠిన చట్టాలతో భరతం పట్టేలా చర్యౌ ఉంటాయి.

అంతే తప్ప సొంత ప్రభుత్వం మీద విమర్శలు ఎన్ని చేసినా ఫలితం ఉండదని అంటున్నారు. మహిళా హోంమంత్రి మీద విమర్శలు చేయడం ద్వారా పవన్ పొలిటికల్ గా రాంగ్ స్టెప్ వేశారనే అంటున్నారు. అంతే కాదు కేబినెట్ అంటే సమిష్టి బాధ్యత. అందులో ఒక మంత్రి మరో మంత్రిని విమర్శించడం రాజ్యాంగ విరుద్ధం అని కూడా అంటున్నారు. మొత్తానికి ఆవేశంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సర్వత్రా చర్చకు తావిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News