టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ అధినేత.. జగన్‌ల పంథాలు వేరు. ప్రజలతో వారు కనెక్ట్ అయ్యే తీరు కూడా వేరు. ఇక, రాజకీయంగా వారు అనుసరించే వ్యూహాలు.. దారులు కూడా వేర్వేరు. ఎక్కడా ఇద్దరికీ మధ్య సాపత్యం ఉండనే ఉండదు. రాజకీయాల్లో ఏదైనా విషయం చర్చకు వస్తే.. చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంబిస్తారు. కానీ, జగన్ దూకుడు నిర్ణయమే తప్ప.. నాన్చుడు ధోరణి ఉండదు. ఇక, ఎక్కడైనా నాయకులు జారిపోతున్నారని అనిపిస్తే.. ఇక, దానిని పట్టుకుని.. వేలాడుతూ.. రాజకీయం చేయడం... దాని నుంచి సింపతీ సంపాయించుకోవడం అనే విషయంలో భిన్నమైన వైఖరులు అనుసరిస్తున్నారు.. వైసీపీ, టీడీపీ అధినేతలు.
ఇంత వరకు బాగానే ఉంది. ఏ ఒక్క విషయంలోనూ అటు చంద్రబాబుకు ఇటు.. జగన్‌కు మధ్య పోలిక లేదా? ఎక్కడా వారి అభిప్రాయాలు కలుసుకోనేలేదా? అంటే.. ఒకే ఒక్క విషయంలో ఇద్దరు నేతలు ఒకే పంథాను అనుసరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అదే.. మీడియా అంశం! చంద్రబాబు తన పాలనలో మీడియాను నమ్ముకున్నారు. మీడియాలో తాను నిత్యం కనిపించాలని, అనుక్షణం .. జనాలు తన మాటలే వినాలని.. తననే చూడాలని పరితపించారు. ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదేసమయంలో తన ప్రభుత్వంపైనా, తన మంత్రులపైనా ఏదైనా వ్యతిరేక వార్త వస్తే.. వెంటనే చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యేవారు.
దీంతో కొన్నాళ్లు ఆయనను మీడియా బాబు అని ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. ఇక, జగన్ విషయంలో ఇంత మీడియా పిచ్చిలేదు. ఆయన ప్రచారాలకు చాలా విరుద్ధం. తన పాలనలో ప్రజలు లబ్ధి పొందుతున్నారు కాబట్టి గ్రౌండ్ లెవిల్లో.. మౌత్ పబ్లిసిటీ వస్తే.. అది చిరకాలం నిలిచిపోతుందని అనుకునే టైపు. అయితే, ఓ విషయంలో మాత్రం జగన్ కూడా బాబును తలపిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మీడియాలో సర్కారుపై వచ్చే కథనాలను పట్టించుకునేది లేదని అంటూనే.. ఆయా కథనాలు, అంశాలు, వ్యతిరేక ప్రచారంపై `మార్పులు` చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల న్యూడెవలప్ బ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల టెండర్లపై ఓ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా.. బిడ్లను రద్దు చేయడం సర్వత్రా విస్మయాన్ని కలిగించింది. ఓ వర్గం మీడియా ఎలాగూ బురద జల్లుతోందని తెలిసి కూడా ఇలా రద్దు ఎందుకు చేశారు? అనే విషయంపై వైసీపీ నాయకులు తర్జన భర్జన పడ్డారు. అయితే, పూర్తి పారదర్శకతకు తన సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పడం కోసమే.. జగన్ ఇలా రద్దు చేస్తూ.. నిర్ణయించారనేది సీనియర్ల మాట.