యర్రగొండ్లపాలెం వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఆదివారం టీడీపీలో చేరడం... మరింత మంది చేరుతారని టీడీపీకి చెందిన మంత్రి ప్రత్తిపాటి చెబుతుండడం చూస్తుంటే ఆయన చెప్పినట్లుగా మార్చి 5లోగానే వైసీపీకి మరింత నష్టం కలిగే సూచనలున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరుతారంటూ దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పలువురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుండడంతో ఏ నిమిషానికి ఎవరు పార్టీని వీడుతారో అని జగన్ కలవరపడుతున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమైన ఒక్క రోజులోనే అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో ఆయన షాక్ తిన్నారట. జిల్లాలవారీగా సమావేశాలు పెట్టినా కూడా ప్రయోజనం లేదని.... టీడీపీలోకి వెళ్లబోమని చెబుతున్న ఒక్క రోజులోనే ఇలా గోడ దూకితే వారిని ఎలా నమ్ముతామని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడాయన 5వ తేదీలోపు టీడీపీలోకి వెళ్లబోయేది ఎవరు? వారిని ఆపడం ఎలా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ ఎమ్మెల్యేల్లో ప్రతి ఒక్కరినీ అనుమానంగానే చూస్తున్నారట.
చివరకు జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ నేత కూడా పార్టీ మారుతారని ఊహాగానాలు వినిపిస్తుండడంతో ఆయన కూడా జగన్ నుంచి అనుమానపు చూపులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలంతా తెగ ఇబ్బంది పడుతున్నారట. ఇలాంటి జంపింగ్ ల టైంలో అధినేతకు కనిపించకపోతే ఒక బాధ... కనిపిస్తే ఈ అనుమానపు చూపుల బాధ అంటూ ఒకరి గోడు ఒకరితో చెప్పుకొంటున్నారట వైసీపీ నేతలు.